చికెన్ బిర్యానీలో బొద్దింక... శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడికి షాక్

Cockroach in Chicken Biriyani | మొదట ఓ ప్రయాణికుడికి భోజనంలో పురుగు కనిపించింది. వెంటనే రైలులోని సిబ్బందిని పిలిచి ప్రశ్నించాడు. ఇంతలో మరో ప్రయాణికుడు ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో బొద్దింక కనిపించింది.

news18-telugu
Updated: February 8, 2019, 4:51 PM IST
చికెన్ బిర్యానీలో బొద్దింక... శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడికి షాక్
చికెన్ బిర్యానీలో బొద్దింక... శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడికి షాక్
  • Share this:
మీరు రైలులో ప్రయాణించేప్పుడు బిర్యానీ ఆర్డర్ చేద్దామనుకుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్త. ఓ ప్రయాణికుడు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో బొద్దింక కనిపించింది. పూరీ-హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఘటన ఇది. మొదట ఓ ప్రయాణికుడికి భోజనంలో పురుగు కనిపించింది. వెంటనే రైలులోని సిబ్బందిని పిలిచి ప్రశ్నించాడు. ఇంతలో మరో ప్రయాణికుడు ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో బొద్దింక కనిపించింది.

నేను ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో బొద్దింక ఉంది. మేం వెంటనే సిబ్బందిని పిలిచి సమాచారం ఇచ్చాం. మొదట మాకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. మేం కంప్లైంట్ ఇస్తామని గట్టిగానే చెప్పాం. ఆహారం అంతా ఒకే కంటైనర్‌లో ఉండటంతో మాకు ఎవరికీ మధ్యాహ్నం భోజనం లేదు.
తపస్ సేన్ గుప్తా, ప్రయాణికుడు


Cockroach Found in Chicken Biriyani, Cockroach in Chicken Biriyani, Cockroach Biriyani, Puri-Howrah Shatabdi Express, IRCTC, Indian Railways, చికెన్ బిర్యానీలో బొద్దింక, బిర్యానీలో బొద్దింక, పూరీ-హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌, ఐఆర్‌సీటీసీఈ ఘటనపై News18 రైల్వే మంత్రిత్వ శాఖకు ఇమెయిల్ రాసింది. కానీ ఎలాంటి స్పందన రాలేదు. రైళ్లల్లో పరిశుభ్రత ఓ పెద్ద సమస్యగా మారింది. ఇటీవలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైళ్లల్లో పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. కానీ అప్పుడప్పుడూ బయటపడుతున్న ఇలాంటి ఘటనలు ప్రయాణికుల్ని కలవరపరుస్తున్నాయి. రైళ్లల్లో భోజనం ఆర్డర్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నది వాస్తవం.

Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...

ఇవి కూడా చదవండి:

మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి

SBI Alert: కార్డు మోసాలు జరుగుతున్నాయి... ఇలా జాగ్రత్తపడండి

PAN-AADHAR link: పాన్ కార్డుతో ఆధార్ లింక్... డెడ్‌లైన్ మార్చి 31
First published: February 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>