ఏపీలో మరో సారి కోడి కత్తి దాడి... ఎవరి మీదంటే...

కోడి పందేలు జరుగుతున్నాయన్న సమచారంతో దాడులు చేయడానికి వెళ్లిన పోలీసులపై కోడి కత్తితో దాడి చేశారు

news18-telugu
Updated: December 28, 2019, 9:07 PM IST
ఏపీలో మరో సారి కోడి కత్తి దాడి... ఎవరి మీదంటే...
అనంతపురం జిల్లాలో కానిస్టేబుల్ మీద కోడికత్తితో దాడి
  • Share this:
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బట్టివానిపల్లి గ్రామ శివార్లలో కోడి పందెంరాయుళ్ల పై పోలీసులు శనివారం సాయంత్రం మెరుపుదాడులు నిర్వహించారు. సుమారు 12 మంది గుట్టుచప్పుడు కాకుండా కోడిపందెం ఆడుతున్నారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ నేపథ్యంలో 11 మంది పారిపోగా ఒకరు పట్టుబడ్డారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రమేష్ కోడిపందెం ఆడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొనే సమయంలో అతను కోడి కత్తితో దాడి చేయడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి కానిస్టేబుల్ రమేష్ కు వీపు పైన తీవ్ర గాయాలయ్యాయి. కోడి పందేల పై ఆకస్మిక దాడులకు నేతృత్వం వహించిన కళ్యాణదుర్గం రూరల్ ఎస్సై సుధాకర్ తన సిబ్బందితో కోడి పందెంరాయుళ్ల కోసం గాలించినా ఫలితం లేకపోయింది . పందెం రాయుళ్లు విడిచిపెట్టి పోయిన 12 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. గాయపడిన కానిస్టేబుల్ రమేష్ ను అనంతపురం తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.

First published: December 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు