Cobra bites Chef: చనిపోయిన 20 నిమిషాలకు లేచి మనిషిని చంపిన కోబ్రా.. ఎక్కడంటే

ప్రతీకాత్మక చిత్రం

కోబ్రాను చెఫ్​ పెంగ్​ సూప్​ కోసమని తెచ్చాడు. దానిని ముక్కలు ముక్కలు(parts)గా కట్(cut)​ చేశాడు. అనంతరం చర్మంతో సూప్​ను తయారుచేశాడు. ఇదంతా జరగడానికి ఓ 20 నిమిషాల సమయం పట్టింది. ఆ తర్వాత కోబ్రాలోని తల భాగం తీసి చెత్తకుండీ(dustbin)లో వేద్దాం అనుకొని పట్టుకున్నాడు. అంతే..

 • Share this:
  మరణం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఒక చనిపోయిన జీవి మరో జీవిని చంపగలదా? ఎక్కడైనా సాధ్యమేనా అంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటన దానికి నిదర్శనం. చైనా(China)లో చనిపోయిన ఓ కోబ్రా(Cobra) అక్కడి హోటల్​ చెఫ్​(chef)ను కాటేసి చంపేసింది. అదేంటి.. చనిపోయిన పాము(snake) ఎలా చంపగలదు(kill) అనుకుంటున్నారా? వినడానికి వింతగా ఉన్నా దక్షిణ చైనా(south china)లో ఈ ఘటన జరింగింది. చనిపోయిన ఓ కోబ్రా తల 20 నిమిషాల అనంతరం లేచి అక్కడి చెఫ్​ను కాటేసింది. కోబ్రా మామాలుగా ఎవరినైనా 30 నిమిషాల్లో చంపేయగలదంట. ఇంతకీ ఆ హోటల్​లో ఆ పాము ఏం చేస్తుందంటారా? కస్టమర్ల కోసం స్నేక్​ సూప్(snake soup)​ తయారుచేయడానికి తీసుకొచ్చారు. కోబ్రాను తీసుకురావడం, ముక్కలు ముక్కలుగా కట్​ చేయడమూ జరిగింది. కానీ, ఓ  20 నిమిషాల తర్వాత కోబ్రాలోని తల(head) భాగం మాత్రం చెఫ్​ని కాటేసింది. అసలు ఎలా కాటేసింది(bite).. ఎందుకు అలా జరిగింది.. ఈ స్నేక్​ సూప్​ ఏంటి.. వివరాలు తెలుసుకుందాం..

  దక్షిణ చైనాలోని పెంగ్ రెస్టారెంట్‌ (peng restaurant)లో కోబ్రా సూప్ తయారు చేస్తారు. కోబ్రా చర్మం(skin)తో ఆ సూప్​ను రెడీ చేస్తారు. అక్కడి ప్రజలు కూడా ఆ సూప్​ను ఇష్టంగా తాగుతారు. కోబ్రాను చెఫ్​ పెంగ్​ సూప్​ కోసమని తెచ్చాడు. దానిని ముక్కలు ముక్కలు(parts)గా కట్(cut)​ చేశాడు. అనంతరం చర్మంతో సూప్​ను తయారుచేశాడు. ఇదంతా జరగడానికి ఓ 20 నిమిషాల సమయం పట్టింది. ఆ తర్వాత కోబ్రాలోని తల భాగం తీసి చెత్తకుండీ(dustbin)లో వేద్దాం అనుకొని పట్టుకున్నాడు. అంతే ఒక్కసారిగా ఆ కోబ్రా తలభాగం చెఫ్​ పెంగ్​ని కాటేసింది. దీంతో రెస్టారెంట్​లో పరిస్థితులు  మారిపోయాయి. అక్కడ గందరగోళం చూసి కస్టమర్లకు సైతం ఏం అర్థం కాలేదట. యాంటీ స్నేక్​ వీనమ్​ ఇంజెక్షన్​ తీసుకోవడంలో ఆలస్యం అయింది. అతన్ని రక్షించడానికి అంబులెన్స్​ వచ్చినా లాభం లేకపోయింది.  కోబ్రా విషం అప్పటికే పెంగ్​ శరీరంలో(body)కి ప్రవేశించింది. అరగంటలో చెప్​ పెంగ్​ మరణించాడు.  ఆ రెస్టారెంట్​కు కోబ్రా సూప్​ తాగడానికి వచ్చిన వారంతా పెంగ్​ మరణంతో షాక్​కు గురయ్యారు. కాగా, చనిపోయిన కోబ్రా తల లేచి మనిషిని చంపడంపై అధికారులు స్పందించారు. కోబ్రా చనిపోయిన తర్వాత ఓ అరగంట పాటు తనలోని భాగాలు బతికే ఉంటాయట. అందుకే చెప్​ పట్టుకోగానే తలభాగం కాటేసిందని అన్నారు.

  పాము కాటు కారణంగా ప్రపంచంలో ప్రతి సంవత్సరం 1 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత పెద్ద, పొడవైన విష సర్పాలలో కింగ్ కోబ్రా మొదటిది. ఇది నేల పైన జీవించే సర్పం. సాధారణంగా ఇది 18.5 అడుగుల (5.7 మీటర్) పొడవు పెరుగుతుంది. బరువు సుమారుగా 44 పౌండ్లు (8 కిలోలు) ఉంటుంది. దీని విషము మెదడు మీద అత్యంత ప్రభావం చూపుతుంది. ఇది కాటు వేస్తే మరణించే అవకాశం 75% వరకు ఉంది. ఆహారంగా ఇతర పాములను, కొండ చిలువలను తింటుంది. చూడటానికే భీతి గొలిపే ఈ పాము స్వభావ సిద్దంగా సిగ్గరి. సాధారణంగా ముఖాముఖి ఎవరి కంటబడటానికి ఇష్ట పడదు. ఇతర కోబ్రా జాతి పాముల వల్లే ఈ పాము కూడా తన పొడవులో మూడవ వంతు వరకు పడగ ఎత్తగలదు. ఎటాక్​ చేయడానికి ఈ పాము పడగ పైకెత్తి పెద్దగా బుస కొడుతుంది. బాగా ఎదిగిన కింగ్ కోబ్రా పడగ పైకెత్తితే ఆరు అడుగుల ఎత్తులో, ఎదురుగా నిలిచిన మనిషి కళ్ళలోకి ఉగ్రంగా చూస్తుంది.
  Published by:Prabhakar Vaddi
  First published: