కాలిఫోర్నియా మహిళ అరెస్టు... కుక్కపిల్లల్ని చెత్తబుట్టలో పడేసినందుకు...

California Crime : ఓ స్టోర్ ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో... ఆ మహిళ చేసిన నిర్వాకం బయటపడింది. ప్రాణుల పట్ల ఆమె చూపించిన నిర్లక్ష్యానికి కఠిన శిక్ష వెయ్యాలంటున్నారు నెటిజన్లు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 28, 2019, 3:02 PM IST
కాలిఫోర్నియా మహిళ అరెస్టు... కుక్కపిల్లల్ని చెత్తబుట్టలో పడేసినందుకు...
కుక్క పిల్లల్ని చెత్తబుట్టలో వేసిన మహిళ (Image : Twitter)
  • Share this:
కాలిఫోర్నియా పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఆమె ఓ చెత్తబుట్టలో ఏదో పడేయడాన్ని సీసీ కెమెరా దృశ్యాల్లో చూసిన పోలీసులు... ఆమె ఎవరో కనిపెట్టి... అరెస్టు చేశారు. కోచెల్లాలో నివసిస్తున్న ఆమె జంతువుల పట్ల ఆమె ఎంత క్రూరంగా ప్రవర్తించిందో ఆ వీడియో బయటపెట్టిందని రివర్స్ సైడ్ కౌంటి యానిమల్ సర్వీసెస్ సంస్థ తెలిపింది. ఓ స్టోర్ ముందు ఉన్న ఆ వీడియోను పరిశీలిస్తే... ఆ మహిళ తన వెహికిల్ నుంచీ దిగి... ఐదు కుక్కపిల్లలున్న సంచిని... అక్కడి డ్రైనేజీలో పడేద్దామనుకుంది. డ్రైనేజీ పక్కనే డస్ట్ బిన్ ఉండటంతో... ఆ చెత్త డబ్బాలో వాటిని విసిరేసి... వెంటనే వెహికిల్ ఎక్కి వెళ్లిపోయింది. జస్ట్ 3 రోజుల వయసున్న ఆ పప్పీల పట్ల ఆమె ఎంత నిర్దయగా ప్రవర్తించిందో ఆ వీడియో ద్వారా తెలుస్తోంది.

కాసేపటి తర్వాత అటుగా వెళ్తున్న జాన్... కుక్క పిల్లల మూలుగులు విన్నాడు. అతని హృదయం చలించింది. డౌట్ వచ్చిన అతను డస్ట్ బిన్ దగ్గరకు వెళ్లాడు. సంచిలో గిలగిలా కొట్టుకుంటున్న పప్పీలను చూసి ఆశ్చర్యపోయాడు. అతనే గనక కాపాడకపోయి ఉంటే... ఆ కుక్కపిల్లలు చచ్చిపోయేవేనని జంతు సంరక్షణ అధికారులు తెలిపారు.

california news, america news, usa news, viral news, viral video, crime news, crime, dogs, puppies, cctv footage, కాలిఫోర్నియా న్యూస్, అమెరికా న్యూస్, వైరల్ న్యూస్, వైరల్ వీడియో, క్రైమ్ న్యూస్, క్రైమ్, కుక్కలు, కుక్కపిల్లలు, పప్పీలు,
కుక్క పిల్లల్ని చెత్తబుట్టలో వేసిన మహిళ (Image : Twitter)


ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ సైట్లలో వైరల్ అయ్యింది. ఆ మహిళను దెబోరా స్యూ కల్వెల్‌గా గుర్తించిన పోలీసులు... అరెస్టు చేశారు. ఆమెకు మానవత్వం లేదనీ, దుర్మార్గురాలనీ, హృదయంలేని వ్యక్తి అనీ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రతీ కుక్కపిల్లకూ విడివిడిగా శిక్షను నిర్ధారించి... అన్నింటికీ కలిపి భారీగా శిక్ష వెయ్యాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆరెంజ్ కౌంటీ దగ్గరున్న రెస్క్యూ షెల్టర్‌లో ఆ కుక్క పిల్లలు క్షేమంగా ఉన్నాయి.

ఆ మహిళకు ఇంట్లో 38 కుక్కలు ఉండటంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కోచెల్లా వ్యాలీ క్యాంపస్‌కు వాటిని తరలించారు. ఆమె పారేసిన కుక్క పిల్లల తల్లి ఎవరన్నది తెలుసుకుంటున్నారు.

 

ఇవి కూడా చదవండి :

4th Phase : 9 రాష్ట్రాలు... 71 సీట్లు... సోమవారం నాలుగో దశ పోలింగ్... ఇవీ ప్రత్యేకతలు...

కౌంటింగ్ రోజున ఏజెంట్లు ఏం చెయ్యాలంటే... ఈసీ ఏం చెప్పిందంటే...

ఓటు వేయలేకపోతున్న విరాట్ కోహ్లీ... ఎక్కడ తేడా వచ్చిందంటే...

ఏపీలో పెరిగిన పోలింగ్ వైసీపీకి కలిసొస్తుందా... టీడీపీకి మేలు చేస్తుందా...

మే 26న జగన్ ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తారా... ఆ రోజే మంచిదంటున్న జ్యోతిష్యులు... ఎందుకంటే...
First published: April 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు