ఐపీఎల్‌లో ‘డ్రగ్స్’ కలకలం... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై నిషేధం?...

25 గ్రాముల కొకైన్‌తో జపాన్‌లోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయిన నెస్ వాడియా... రెండేళ్ల జైలుశిక్ష విధించిన జపాన్ కోర్టు... 2014 సీజన్‌లోనే నెస్ వాడియాపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన ప్రీతిజింటా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 6:42 PM IST
ఐపీఎల్‌లో ‘డ్రగ్స్’ కలకలం... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై నిషేధం?...
ఐపీఎల్‌లో ‘డ్రగ్స్’ కలకలం... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై నిషేధం?...
  • Share this:
ఐపీఎల్ సీజన్ 12ను డ్రగ్స్ కలకలం చుట్టుముట్టింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ-యజమాని నెస్ వాడియా, జపాన్ విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడడం సంచలనం క్రియేట్ చేసింది. డ్రగ్స్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన నెస్ వాడియాకు రెండేళ్ల జైలుశిక్ష్ విధిస్తూ తీర్పు వెలువరించింది జపాన్ న్యాయస్థానం. రెండు నెలల క్రితం 25 గ్రాముల కొకైన్‌తో జపాన్‌లోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు నెస్ వాడియా. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిరూపితం కావడంతో నెస్ వాడియాకు తాజాగా జైలుశిక్ష విధిస్తూ, తీర్పు వెలువరించింది కోర్టు. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. సీజన్ ప్రారంభానికి ముందు ‘మన్కడింగ్’ వివాదం కారణంగా అశ్విన్‌ను సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ జట్టుకు వివాదాలు కొత్తేమీ కాదు. 2014 సీజన్‌లోనే నెస్ వాడియాపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది మరో సహ-యజమాని, హీరోయిన్ ప్రీతిజింటా. తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చేసింది. అయితే కొన్ని వాదోప వాదనల తర్వాత ప్రీతిజింటా ఆ కేసును వెనక్కి తీసుకుంది.
Ipl live score, Indian premier league, kings xi punjab, Committee of Administrators (CoA), Ness Wadia, co-owner of IPL team Kings XI Punjab,drugs possession, drugs in ipl, ban on kings xi punjab, KXIP, Chris gayle, Lokesh Rahul,R ashwin, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పంజాబ్ జట్టుపై నిషేధం, ఐపీఎల్ 2019,ఇండియన్ ప్రీమియర్ లీగ్,డ్రగ్స్ ఐపీఎల్, ప్రీతిజింటా, రాహుల్, అశ్విన్, క్రిస్ గేల్, పంజాబ్ బ్యాన్ డ్రగ్స్
కొకైన్‌తో జపాన్‌లోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయిన నెస్ వాడియా


కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడం, ఆ జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) నియమావళి ప్రకారం జట్టులో ఉన్న వ్యక్తులు గానీ, జట్టుతో ప్రత్యేక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు గానీ ఏదైనా తీవ్ర నేరం కింద అరెస్టైనా, నేరం రుజువైనా... ఆటకు అప్రతిష్ట తెచ్చే పనులు చేసినా ఆ జట్టుపై నిషేధం పడుతుంది. కొందరు ఆటగాళ్లు, యజమానులు కలిసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. 2016, 2017 సీజన్లలో నిషేధం ఎదుర్కొన్న ఈ జట్లు... మళ్లీ 2018 సీజన్ నుంచి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఆ టీమ్‌పై సస్పెషన్ వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించిన సీఓఏ (కమిటీ ఆఫ్ అడ్మినిస్టేటర్స్) ఈ విషయమై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే సీజన్ మధ్యలో ఉన్నందున ముగిసే దాకా వేచి చూడాలని భావిస్తోంది. శుక్రవారం సమావేశమయ్యే సీఓఏ కమిటీ... పంజాబ్ జట్టు నిషేధం గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి.

రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీలో తాజా సీజన్‌లో ఇప్పటికే 12 మ్యాచులు ఆడిన పంజాబ్ జట్టు 5 మ్యాచుల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నప్పటికీ పంజాబ్‌కి ఇంకా ఫ్లేఆఫ్ చేరే అవకాశాలు ఉన్నాయి.
Published by: Ramu Chinthakindhi
First published: May 1, 2019, 6:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading