CMRF SCAM UPDATE KEY PERSONS ARRESTED AND ACB SUSPECTED MANY MORE INVOLVE POLITICAL LEADERS NGS
CMRF Scam Upadate: కదులుతోన్న డొంక.. ప్రధాన నిందితులు అరెస్ట్.. స్కామ్ ఎలా చేశారంటే..?
ఏపీ సచివాలయం (ఫైల్)
Andhra Pradesh: CMRF స్కామ్ డొంక కలుగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. అలాగే రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ స్కామ్ ఎలా చేశారన్నది క్లియర్ గా వెల్లడించారు.
CMRF Scam Upadate: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎంఆర్ఎఫ్ స్కామ్ (CMRF Scam) సంచలనం రేపింది. 2014 నుంచి అక్రమాలు జరిగినట్టు ఈ కేసును దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు గుర్తించారు. సచివాలయ సిబ్బందే ఈ కేసులో నిందితులుగా ఉన్నారు ఏసీబీ (ACB)అధికారులు తేల్చారు. 88 నకిలీ క్లెయిమ్‌లను గుర్తించారు. 60 లక్షల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్టు తేల్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మయ్యపై కేసు నమోదు చేశారు. ఐపీసీ (IPC) 409, 420, 468, 471 రెడ్‌విత్ 120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనెల 21న కేసు రిజిస్టర్ చేశారు ఏసీబీ అధికారులు. పేదల డేటా సేకరించి సీఎంఆర్ఎఫ్ (CRMF) నిధులు పక్కదారి పట్టించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ భారీ స్కామ్‌లో 50 మంది ప్రమేయం ఉన్నట్టు మొదట భావించారు. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అయితే నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు.
తప్పుడు పేర్లు, తప్పుడు పత్రాలతో CMRF నిధులు నొక్కేసినట్లు తేల్చారు ఏసీబీ అధికారులు. CMRFలో అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో ఏసీబీ విచారణ జరిపింది. CMRF లాగిన్ ఐడీ, పాస్ వర్డ్‌లని సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లెయిమ్స్‌తో నిధులు దిగమింగినట్లు గుర్తించారు.
సచివాలయంలో పనిచేసే చలువాడి సుబ్రమణ్యం, సోక రమేశ్‌లతో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు చదలవాడ మురళీ కృష్ణ, ధన్రాజును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా మచిలీపట్నం జైలులో ఉన్నారు. కోవిడ్ పరీక్షల అనంతరం రాజమండ్రి జైలుకు తరలించనున్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఏపీ సచివాలయంలో పనిచేస్తోన్న 50 మందిని పూర్తిస్థాయిలో విచారించింది ఏసీబీ. దీంతో CMRF కేసులో ఎప్పుడు, ఎవరిని అరెస్ట్ చేస్తారో అని సచివాలయ ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. ఏడేళ్లుగా అక్రమాలు జరిగాయని తేలయడంతో ఈ కేసులో ఇంకా ఎంత మంది ప్రమేయం ఉంది ? ఎన్ని నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు నొక్కేశారో ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు.
ఈ కేసు దర్యాప్తు చేసినకొద్దీ నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో సంచలనం కలిగించిన CMRF రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 21న కేసు రిజిస్టర్ చేసిన ఏసీబీ అధికారులు… పేదల డేటా సేకరించి సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. తప్పుడు పేర్లు, తప్పుడు పత్రాలతో CMRFనిధులు నొక్కేసినట్లు తేల్చారు ఏసీబీ అధికారులు.
వైద్య సహాయం అవసరంలేని వారి ఆధార్లను సైతం లింక్ చేసినట్లు, చిన్న ఆపరేషన్‌కు కూడా భారీగా బిల్లులు పెట్టినట్లు గుర్తించారు. అయితే.. అక్రమార్కులు లబ్ధిదారులకు పూర్తి సొమ్ము ఇవ్వలేదని, 80 శాతానికి పైగా కాజేశారని ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న 50 మందిని పూర్తిస్థాయిలో విచారించింది ఏసీబీ. చెన్నై, బెంగళూరు E.N.T ఆస్పత్రుల్లో చికిత్స పొందినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని పేర్కొంది. మరికొందరి నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తోంది. దీంతో ఈ కేసులో ఎప్పుడు, ఎవరిని అరెస్ట్ చేస్తారోనని సచివాలయ ఉద్యోగుల్లో అలజడి మొదలైంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.