హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral: ముసలోడే కానీ మహా రసికుడు.. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేమో..

Viral: ముసలోడే కానీ మహా రసికుడు.. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేమో..

వీడియోలోని దృశ్యం

వీడియోలోని దృశ్యం

ఆయన వయసు 50 ఏళ్ల పైమాటే. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. కానీ.. బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మగువ మత్తులో పడి పరువు పోగొట్టుకున్న ప్రబుద్ధుడికి సంబంధించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...

  అశోక్‌నగర్: ఆయన వయసు 50 ఏళ్ల పైమాటే. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. కానీ.. బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మగువ మత్తులో పడి పరువు పోగొట్టుకున్న ప్రబుద్ధుడికి సంబంధించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అశోక్‌నగర్ మున్సిపాలిటీలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పీకే సింగ్ ఓ మహిళతో అభ్యంతరకర స్థితిలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  ఆ వీడియో వాస్తవమేనని తేలడంతో పీకే సింగ్‌ను గ్వాలియర్ కమిషనర్ ఆశిష్ సక్సేనా సస్పెండ్ చేశారు. ఆ మహిళతో ఈ ప్రబుద్ధుడికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక వీడియోలో పీకే సింగ్ ఆ మహిళతో మాట్లాడిన మాటలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఆ వీడియోలో పీకే సింగ్ ఆ మహిళను కౌగిలించుకుని.. ఆమెకు పెద్ద పెద్ద మాటలే చెప్పాడు.

  చాలా అసభ్యకర పదాలు వాడుతూ ఆమెతో దిగజారి మాట్లాడాడు. అంతేనా.. ‘నీ బరువుకు తగినంత డబ్బుతో నిన్ను తూకం వేస్తాను. నాకు రూ.10 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉంది. గురుగ్రామ్‌లో నాలుగు కోట్లు విలువ చేసే ఫ్లాట్ కూడా ఉంది. నీ బరువు ఎంత’ అని పీకే సింగ్ అడిగాడు. తన బరువు 58 కేజీలని ఆ మహిళ చెప్పగానే.. నీ బరువుకు తగినంత డబ్బు నీకిస్తాను’ అని ఆయన చెప్పాడు. ఆ మహిళను వాటేసుకుని ముద్దులు పెట్టాడు. మొత్తం వీడియో 9 నిమిషాల 30 సెకన్లు ఉంది. వీడియో తీసింది ఎవరో కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేయడంతో మగువలపై ఈ సారు గారి మోజు బయటపడింది. ఇదిలా ఉంటే.. ఈ వీడియో ఇప్పటిది కాదని.. 2014-15 సమయంలో తీసిన వీడియో అని తేలింది. ఈ వీడియోను ఇప్పుడు వైరల్ చేయడంతో పీకే సింగ్ వ్యవహారం బయటపడింది.

  ఇది కూడా చదవండి: OMG: ఇంత అందమైన అమ్మాయి భార్యగా వస్తే వేరేవాళ్ల సంగతి ఏమో గానీ ఇతనేం చేశాడో చూడండి..

  ఈ తరహా ఘటనే కర్నాటకలో తాజాగా వెలుగుచూసింది. డాక్టర్ రత్నాకర్ అనే వ్యక్తి కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నాడు. దక్షిణ కన్నడ జిల్లాలో జిల్లా స్థాయి వైద్యాధికారిగా పనిచేస్తున్న రత్నాకర్ తన కార్యాలయంలో ఇద్దరు మహిళా ఉద్యోగులను మీద కూర్చోబెట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నవంబర్ 26 నుంచి ఈ ఫొటో కర్నాటక సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటోపై మీమ్స్ కూడా వస్తున్నాయి. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి మహిళా ఉద్యోగులతో కలిసి ఇవేం పనులంటూ డాక్టర్ రత్నాకర్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. మంగళూరులోని తన కార్యాలయంలో ఇద్దరు మహిళలతో ఇతగాడు వెలగబెడుతున్న రాచకార్యాలకు ఈ ఫొటోనే నిదర్శనం. రత్నాకర్ ‘Leprosy Eradication Wing’ లో నోడల్ అధికారిగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

  ఇది కూడా చదవండి: Affair: చెల్లి భర్తతో అక్క వివాహేతర సంబంధం.. అఫైర్ కొనసాగించేందుకు ఆ అక్క ఎంత పనిచేసిందో చూడండి..

  ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో మంగళూరు మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు రత్నాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైరల్ అయిన ఫొటోలు, వీడియోలపై రత్నాకర్‌తో కనిపించిన మహిళలను ప్రశ్నించగా తనకు సహకరించకపోతే రత్నాకర్ టార్గెట్ చేసేవాడని.. తమలో కొందరు మహిళలను బలవంతంగా తనతో పాటు టూర్లకు కూడా తీసుకెళ్లేవాడని.. వాళ్లతో ఫొటోలు, వీడియోలు తీసుకునేవాడని చెప్పారు. మంగళూరు కమిషనర్ ఎన్.ఏ.శశికుమార్ మాట్లాడుతూ.. నిందితుడు రత్నాకర్‌ను కస్టడీకి తరలించినట్లు తెలిపారు. రత్నాకర్ ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో అతనిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Madhya pradesh, Viral Video

  ఉత్తమ కథలు