Paytm: పేటీఎం నుంచి రూ.35 వేలు మాయం చేసిన 8 ఏళ్ల బుడతడు...తండ్రికి షాక్...

తండ్రి పేరిట పేటీయం అకౌంట్ సృష్టించి దాన్ని బ్యాంక్ అకౌంట్ తో జత చేసి డబ్బులు గుంజుతున్నట్లు గమనించారు. అంతేకాదు ఆ డబ్బుతో ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుతున్నట్లు గుర్తించారు.

news18-telugu
Updated: September 6, 2019, 6:05 PM IST
Paytm: పేటీఎం నుంచి రూ.35 వేలు మాయం చేసిన 8 ఏళ్ల బుడతడు...తండ్రికి షాక్...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 6, 2019, 6:05 PM IST
ఉన్నపళంగా బ్యాంకు అకౌంట్ నుంచి రూ.35 వేలు మాయం కావడంతో ఓ వ్యక్తి లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఆ డబ్బులు కొట్టేసింది ఎవరో కాదని తన 8 సంవత్సరాల కొడుకే పేటీయం వాలెట్ నుంచి నగదు మాయం చేశాడని తేలడంతో ఆ తండ్రి అవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే యూపీలోని లక్నోలో బాధితుడు తన బ్యాంకు అకౌంట్లో నుంచి డబ్బులు మాయం అవుతున్నట్లు గమనించాడు. అందుకోసం బ్యాంకు వారిని సంప్రదించగా, ఆన్ లైన్ ట్రాన్సక్షన్ల ద్వారా డబ్బు మాయం అవుతోందని బాధితుడికి తెలిపారు. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారించగా, బాధితుడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పేరిట పేటీయం అకౌంట్ ఉందని తేలింది. పేటీయం వాలెట్లోకి అకౌంట్ నుంచి డబ్బును ట్రాన్స్ ఫర్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే బాధితుడు తన పేరిట అసలు పేటీయం అకౌంట్ లేదని పోలీసులకు తెలిపాడు.

దీంతో డబ్బు ఎవరు మాయం చేసి ఉంటారని కుటుంబ సభ్యులను ఆరా తీయగా, బాధితుడి కుమారుడే డబ్బును పేటీయం నుంచి మాయం చేస్తున్నాడని విచారణలో తేలింది. తండ్రి పేరిట పేటీయం అకౌంట్ సృష్టించి దాన్ని బ్యాంక్ అకౌంట్ తో జత చేసి డబ్బులు గుంజుతున్నట్లు గమనించారు. అంతేకాదు ఆ డబ్బుతో ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుతున్నట్లు గుర్తించారు. అయితే బాలుడి వయస్సు కేవలం 8 సంవత్సరాలు కాగా, 4వ తరగతి చదువుతున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...