హోమ్ /వార్తలు /క్రైమ్ /

పంజాబ్‌లో విషాదం....కుక్క దాడిలో మూడోతరగతి చిన్నారి మృతి

పంజాబ్‌లో విషాదం....కుక్క దాడిలో మూడోతరగతి చిన్నారి మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గాలిపటాలు ఎగురవేస్తూ తోటిపిల్లలతో సరదాగా ఆడుకుంటూ పరుగులు తీస్తుండగా... ఓకుక్క వీరిపై దాడికి దిగింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు పరుగులు తీయగా.. ధీరజ్ మాత్రం కుక్క దాడిలో తీవ్ర గాయలపాలయ్యాడు.

    కుక్క దాడిలో పదేళ్ల బాలుడు తీవ్ర గాయాలపాలై మృతిచెందిన దుర్ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నాభ జిల్లాలోని మెహస్ గ్రామానికి చెందిన ధీరజ్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు. ధీరజ్ తండ్రి ఇటుకబట్టిలో కూలీగా పనిచేస్తున్నారు. గాలిపటాలు ఎగురవేస్తూ తోటిపిల్లలతో సరదాగా ఆడుకుంటూ పరుగులు తీస్తుండగా... ఓకుక్క వీరిపై దాడికి దిగింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు పరుగులు తీయగా.. ధీరజ్ మాత్రం కుక్క దాడిలో తీవ్ర గాయలపాలయ్యాడు. దీంతో చిన్నారి వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి కూడా తరలించారు. కానీ డాక్టర్లు మాత్రం ధీరజ్ ప్రాణాలు కాపాడలేకపోయారు.


    అయితే 8 నెలల క్రితం కూడా మెహస్ గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మనిష్ అనే ఏడేళ్ల చిన్నారి కూడా కుక్క దాడిలో చనిపోయాడు. మనీష్ తండ్రి కూడా ఇటుక బట్టీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మామిడికాయలు కోసేందుకు వెళ్తుండగా కుక్క మనీష్‌పై దాడికి దిగింది. గతేడాది బ్రిందన్ గ్రామంలో కూడా ఐదేళ్ల చిన్నారి కుక్కల దాడిలో చనిపోయింది. అయితే ఇక్కడ ఇన్ని ఘటనలు జరుగుతున్న అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2016-17 సంవత్సరంలో కుక్క దాడికి సంబంధించి 300 కేసులు నమోదయ్యాయి.


    పంజాబ్ రోడ్లపై ఐదు లక్షల ఊరకుక్కలు తిరుగుతున్నాయి. కొన్నిరోజుల క్రితమే పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ రూ.25 లక్షల రూపాయలతో మోడ్రన్ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని ముఖ్య లక్ష్యం కుక్కలసంఖ్య పెరగకుండా కనీసం నెలకు 400 వరకు స్టెరిలైజేషన్ చేయాలి. అయితే జంతువులకు చేయాల్సిన ఇలాంటి ఆపరేషన్‌లకు సంబంధించిన అన్ని రకాల పరికరాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ కుక్కల సంఖ్య పెరగకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం.

    First published:

    Tags: Crime