రెండో తరగతి విద్యార్థిపై అత్యాచారం, ఆపై దారుణ హత్య... ఆరుగురిని అదుపులోకి...

నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన చిన్నారి... అతిదారుణంగా హత్య చేసి పడేసిన దుండగులు... వైద్యనివేదికలో అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ... బాలికపై జరిగిన అమానుష చర్యను నిరసిస్తూ 500 మంది గ్రామస్థుల రాస్తారోకో... ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 6:54 PM IST
రెండో తరగతి విద్యార్థిపై అత్యాచారం, ఆపై దారుణ హత్య... ఆరుగురిని అదుపులోకి...
రెండో తరగతి విద్యార్థిపై అత్యాచారం, ఆపై దారుణ హత్య... ఆరుగురిని అదుపులోకి...
  • Share this:
పొల్లాచ్చి దారుణ సంఘటన మరువకుముందే తమిళనాడు రాష్ట్రంలో మరో అమానుష సంఘటన వెలుగుచూసింది. రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిపై అత్యంత పైశాచికంగా అత్యాచారానికి పాల్పడిన దుండగులు... ఆ తర్వాత దారుణంగా ఆమెను హతమార్చారు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చి ఏరియాకు అతి సమీపంలో వెలుగుచూసింది. పొల్లాచ్చి సమీపంలోని గ్రామంలో కుటుంబంతో కలిసి నివాసిస్తున్న ఏడేళ్ల బాలిక... గ్రామంలో స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. మార్చి 25న స్కూల్‌కి వెళ్లిన చిన్నారి... తిరిగి రాలేదు. బాలిక కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తర్వాతి రోజు అతి దారుణంగా హత్య చేయబడిన ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. చిన్నారిపై అత్యంత దారుణంగా దాడి చేసిన దుండగులు... ఆమె అవయవాలను కట్టేసి పడేశారు. ముందుగా కేవలం హత్యగానే భావించిన పోలీసులు... పోస్ట్‌మార్టమ్ నివేదిక చూసి షాక్‌కు గురయ్యారు.

చిన్నారిపై అత్యాచారం జరిగిందని వైద్య నివేదికలో తేలింది. బాలికపై అత్యంత క్రూరంగా అఘాయిత్యం చేసి, ఆ తర్వాత చంపేశారని నిర్ధారించారు వైద్యులు. బాలికపై జరిగిన హత్యాచారం గ్రామస్తులను కదిలించింది. చిన్నారిపై దారుణాన్ని నిరసిస్తూ 500 మంది గ్రామస్థులు కలిసి రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 4 గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చిన పోలీసులు... వారిని అక్కడి నుంచి అతి కష్టం మీద పంపించేశారు. బాలిక తల్లిదండ్రులతో పాటు మహిళా సంఘాల నేతలు జిల్లా కలెక్టర్‌ను కలిసి మెమొరెండమ్ అందచేవారు. దాంతో వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు, బాలికపై హత్యచారం చేసి ఉంటారని అనుమానిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలిక పక్కింట్లో ఉంటున్న వ్యక్తి కూడా ఉండడం విశేషం.

First published: March 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు