చార్మినార్ ముందే చితగ్గొట్టుకున్నారు... ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

పర్యాటకులతో కళకళలాడే చార్మినార్ రణరంగాన్ని తలపించింది. చారిత్రక కట్టడాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులు, షాపింగ్ చేసేందుకు వచ్చిన జనం.. అక్కడ జరిగిన రచ్చతో షాకయ్యారు. భయంతో పరుగులు పెట్టారు. ఇంతకీ ఏం జరిగింది?

news18-telugu
Updated: January 27, 2019, 5:49 PM IST
చార్మినార్ ముందే చితగ్గొట్టుకున్నారు... ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
చార్మినార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
చారిత్రక కట్టడం చార్మినార్‌ను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, దేశవిదేశాల నుంచి పర్యాటకులు నిత్యం వేలాదిగా తరలివస్తుంటారు. దీంతో ఆ ప్రాంతమంతా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అక్కడి లాడ్ బజార్‌, నైట్ బజార్‌లో శాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు జనాలు. సాయంకాలం పూట పర్యాటకులతో పాటు సిటీజనాలు అక్కడికి వస్తుంటారు. దీంతో మరింత సందడిగా ఉంటుందక్కడ. శుక్రవారం సాయంత్రం కూడా అలాంటి వాతావరణమే కనిపించింది. జనాలంతా చార్మినార్‌ను సందర్శించి  ఆ వెంటనే షాపింగ్‌లో నిమగ్నమై పోయారు. ఇంతలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.

చార్మినార్ దగ్గర ఫుట్‌పాత్‌లపై తోపుడు బండ్లు పెట్టుకుని వ్యాపారం చేసుకునే వ్యాపారులు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో.. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో జనాలు బెంబేలెత్తిపోయారు. వ్యాపారులు ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడులు చేస్కోవడంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురై అరుపులు కేకలతో అక్కణ్నుంచి దూరంగా పారిపోయారు. హైదరాబాద్ బార్కాస్‌కు చెందిన సయ్యద్ బిన్ అహ్మద్ సాదీ, సాదమ్ బిన్ సాదీలు తోపుడు బండి ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. రెయిన్ బజార్‌కు చెందిన సలీమ్‌ కూడా అక్కడే తోపుడు బండి ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు.

శుక్రవారం ఎప్పటిలాగే తోపుడు బండి పెట్టుకున్న సలీమ్.. ఎండ తగలకుండా ఒక చిన్న టెంటును ఏర్పాటు చేసుకున్నాడు. అయితే, సాయంత్రం అయినా టెంటు తీయకపోవడంతో సలీమ్‌ను అహ్మద్, సాదమ్‌లు ప్రశ్నించారు. మాటా మాటా పెరగడంతో గొడవకు దారి తీసింది. కోపంతో అహ్మద్, సాదమ్‌లు సలీంపై దాడికి తెగబడ్డారు. ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. ఎదురుగా ఉన్న షాపులపై విధ్వంసానికి దిగారు. ఈ దాడిలో సలీమ్‌కు తీవ్రంగా రక్తస్రావమైంది.
హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి చేసిన వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

 
First published: January 27, 2019, 5:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading