గుంటూరులో ఇసుక రీచ్ గొడవ... తలపగిలేలా కొట్టుకున్న జనం

గుంటూరు ఇసుక రీచ్ వద్ద ఘర్షణ

రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలతో తలలు పగిలేలా కొట్టుకున్నారు.

  • Share this:
    గుంటూరు జిల్లాలో ఇసుక రీచ్ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇన్నాళ్లు ఇసుక దొరకడం లేదని గగ్గోలు పెట్టిన జనం.. ఇప్పుడు ఇసుక లభిస్తుంటే... గొడవలకు దిగుతున్నారు. జిల్లాలోని కొల్లిపర ఇసుక రిచ్ వద్ద గ్రామస్థులు ఘర్షణకు దిగారు. తలలు పగిలేలా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. మధ్యలో పోలీసులు కలగజేసుకొని గొడవను సద్దుమణిగించడంతో ఈ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది. మండలకేంద్రం కొల్లిపరకు సమీపంలోని అన్నవరపులంక రిచ్ వద్ద ఇసుక తవ్వకాల్లో వివాదం చోటుచేసుకుంది.

    దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.కర్రలతో దాడిచేసుగా ఇద్దరికి తలలు పగిలినట్లు తెలుస్తోంది.ఇసుక రిచ్ నిర్వహణలో పలు లోపాలు, అవకతవకలు జరుగుతున్నాయి అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ గొడవలు జరగడం జిల్లాలో హట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇసుక గొడవ పంచాయతీ ఆదివారం సాయంత్రం కొల్లిపర పోలిస్ స్టేషన్ కి చేరుకుంది. ముగ్గురు ఎస్ఐలు, ఓ సీఐ పలువురు వైసీపి నేతలు గ్రామస్థులు పాల్గొని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

    Published by:Sulthana Begum Shaik
    First published: