సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఓ వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాల్లో వైసీపీలోని ఇరువర్గాల ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

news18-telugu
Updated: November 13, 2020, 3:15 PM IST
సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఓ వ్యక్తి మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాల్లో వైసీపీలోని ఇరువర్గాల ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కడప జిల్లా కొండాపురం మండలంలోని పి అనంతపురంలో చోటుచేసుకుంది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని పి అనంతపురం గ్రామానికి చెందిన గురునాథ్‌రెడ్డిగా గుర్తించారు. వివరాలు.. గత కొంతకాలంగా ప్రభుత్వం గండికోట ముంపు బాధితులకు పరిహారం అందజేస్తోంది. అయితే ఆ జాబితాలో అనర్హులు ఉన్నారంటూ గురునాథ్‌రెడ్డి కొద్దిరోజుల కిందట స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ క్రమంలోనే వైసీపీలోని మరో వర్గం గురునాథ్‌రెడ్డితో గొడవకు దిగింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఇరువర్గాలు రాళ్లు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన గురునాథ్‌రెడ్డిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించాలరు. అయితే గురునాథ్ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. వైసీపీ వర్గాల మధ్య ఘర్షణతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో హుటాహుటిన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటను జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు.

కాగా, ఘర్షణకు దిగిన వర్గాల్లో ఒకటి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం అని, మరోకటి కొన్ని నెలల కిందట వైసీపీలో చేరిన  మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అని వర్గం అని తెలుస్తోంది. అయితే ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన గురునాథ్ ‌రెడ్డి రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి.
Published by: Sumanth Kanukula
First published: November 13, 2020, 3:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading