CIVILIAN INJURED IN CROSS FIRING IN SHOPIAN ENCOUNTER DIES PVN
Jammu and Kashmir : మళ్లీ అట్టుడుకుతున్న కశ్మీర్..క్రాస్ ఫైరింగ్ లో పౌరుడు మృతి
ప్రతీకాత్మక చిత్రం
Civilian Died In Cross Firing : జమ్మూకశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆదివారం షోపియాన్ జిల్లాలోని తుర్క్వాగమ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టారు.
Civilian Died In Cross Firing : జమ్మూకశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆదివారం షోపియాన్ జిల్లాలోని తుర్క్వాగమ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తర్క్వాగమ్ పుల్వామాతో కలిపే వంతెన వంతెన సమీపంలో సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఓ పౌరుడు గాయపడ్డారు. వెంటనే అతడిని బలగాలు పుల్వామా జిల్లా హాస్పిటల్ కి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆదివారం స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.
మృతుడిని తుర్క్వాగమ్కు చెందిన షోయబ్ అహ్మద్ ఘనీ(22)గా గుర్తించారు. కాల్పుల తర్వాత ఉగ్రవాదులు సమీపంలో ఉన్న తోటల్లోకి పారిపోయారని..ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేశామని,దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.
మరోవైపు, జమ్మూకశ్మీర్ లోని బుద్గాంలోని చందూరా తహసీల్దార్ కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్(కశ్మీరీ పండిట్) ను గురువారం (మే 12) ఉగ్రవాదులు కాల్చి చంపారు. తహసీల్ కార్యాలయంలోకి చొరబడి ఆయన్ను హత్య చేశారు. రాహుల్ భట్ హత్యతో కశ్మీర్ పండిట్లలో ఆగ్రహావేశాలు రాజుకున్నాయి. కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పండిట్లు నిరసనలకు దిగారు. కశ్మీర్లో తమకు రక్షణ కరువైందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం తమకు రక్షణ కల్పించడంలో విఫలమవుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం తమకు తగిన రక్షణ కల్పించకపోతే మూకుమ్ముడి రాజీనామాలకు సిద్ధమని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న పండిట్లు కేంద్రాన్ని హెచ్చరించారు. శుక్రవారం (మే 13) జరిగిన రాహుల్ భట్ అంత్యక్రియలకు కశ్మీర్ పండిట్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.