విశాఖ స్టీల్ ప్లాంట్‌లో దారుణం... రైఫిల్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

రైఫిల్‌తో కాల్చుకొని మృతిచెందాడు. సతీష్‌ది శ్రీకాకుళం జిల్లా ఏచ్చెర్ల వద్ద రంపపేట గ్రామంగా తెలుస్తోంది.

news18-telugu
Updated: February 19, 2020, 1:13 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో దారుణం... రైఫిల్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖపట్నంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. గాజువాక స్టీల్ ప్లాంట్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సాదు సతీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైఫిల్‌తో కాల్చుకొని మృతిచెందాడు. సతీష్‌ది శ్రీకాకుళం జిల్లా ఏచ్చెర్ల వద్ద రంపపేట గ్రామంగా తెలుస్తోంది. కానిస్టేబుల్ ఆత్మహత్యతో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ వద్ద కలకం రేపింది. క్లాక్ నెంబర్ 11 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు కారణాలు ఏంటి అన్నదానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు సతీష్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు