• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • CID POLICES SUBMIT MP RAGHURAMA KRISHNAMRAJU MEDICAL REPORT TO AP HIGH COURT NGS

RRR: కోర్టుకు రఘురామ మెడికల్ రిపోర్ట్.. ఆలస్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన.. రిపోర్టులో ఏముంది

గుంటూరు జిల్లాకు ఎంపీ రఘురామ

ఎంపీ రఘురామ మెడికల్ రిపోర్ట్ లో ఏముంది? మెడికల్ రిపోర్ట్ సమర్పించడానికి పోలీసులు ఎందుకు కాలయాపన చేశారు.. జీజీహెచ్ లో వైద్య పరీక్షల తరువాత రమేష్ ఆస్పత్రికి తరలిస్తున్నట్టు చెప్పిన పోలీసులు.. ఆయన్ను నేరుగా జిల్లా జైలుకు ఎందుకు తరలించారు. ఇలా ఎన్నో అనుమనాలు నెలకొన్నాయి.

  • Share this:
    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మెడకల్ రిపోర్ట్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన వైద్య నివేదిక సమర్పించాల్సిన దానికి కంటే కొన్ని గంటలు ఆలస్యం అవ్వడంతో.. అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.. ఎందుకు నివేదిక ఆలస్యమెందుకైందని వారు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలను సైతం పోలీసులు బేఖాతరు చేస్తున్నారంటూ రఘురామ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సిద్ధమైన మెడికల్ రిపోర్టును కోర్టుకు సీఐడీ పోలీసులు సమర్పించినట్టు తెలుస్తోంది..

    గుంటూరు జీజీహెచ్ లో  మొత్తం 18 రకాల వైద్య పరీక్షలు చేసినట్టు తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారమం చేసి పరీక్షలకు తోడు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పైనా పరీక్షలు చేసినట్టు సమాచారం. ఈ వైద్య పరీక్షల తరువాత రఘురామ కృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.. మొదట వైద్య పరీక్షల తరువాత రమేష్ ఆస్పత్రికి తరలిస్తారని అందరూ భావించారు కానీ అనూహ్యంగా ఆయనను జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఏం జరిగింది అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

    మెడికల్ రిపోర్టు  నివేదిక రాగానే నేరుగా కోర్టుకు సమర్పించిన పోలీసులు.. జైలుకు ఎందుకు తరిలించారు. అసలు మెడికల్ రిపోర్టులో ఏముంది అన్నదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అసలు రఘురామ  ఆరోగ్య పరిస్థితి ఏం బాగులేదని ఓ వైపు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతే సమయంలో అతడి కాలిపై తీవ్ర గాయాలు ఉండడం ఆందోళన పెరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఐదుగురు ముఖానికి కర్చీఫ్ లు కట్టుకుని తనను కొట్టారని.. నడవలేనని నిర్ధారించుకున్న తరువాతే తనను కొట్టడం ఆపేశారని ఆయన కోర్టుకు ఇఛ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాత్రం ఆయన ఆరోపణలు కొట్టి పడేస్తున్నారు. కేసును తప్పుదారి పట్టించేందుకే ఆయన డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అసలు మెడికల్ రిపోర్టు ఏం ఉంది.. ఆ గాయాలు తాజాగా తగిలినవా.. లేక పోలీసులు కొట్టారు. వేరే ఇతర వ్యక్తులు జైల్లోకి ప్రవేశించి దాడి చేశారా అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది..

    ఇప్పటికే సీల్డ్ కవర్ లో అందిన మెడికల్ రిపోర్ట్ ను కోర్టు పరిశీలిస్తోంది. ఆ రిపోర్టు ఆధారంగా తదుపరి ఆదేశాలు ఇవ్వనుంది. కోర్టు.. మెడికల్ రిపోర్ట్ ఎలా ఉన్నా.. ఇప్పటికే ఆయన్న 14 రోజుల పాటు రిమాండ్ కు ఆదేశాలిచ్చింది కోర్టు.. మరి మెడికల్ రిపోర్ట్ చూసిన తరువాత  ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఆ దెబ్బలు తాజాగా తగిలినవి అని తేలితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు పోలీసులను, ప్రభుత్వాన్ని హెచ్చరించింది.. అందుకే రఘురామ మెడికల్ రిపోర్ట్ కోసం రాష్ట్రమంతా  ఆసక్తిగా ఎదురు చూస్తోంది,.
    Published by:Nagesh Paina
    First published: