news18-telugu
Updated: February 18, 2020, 12:09 PM IST
ప్రతీకాత్మక చిత్రం
గుంటూరు జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా మరో పోలీసు అధికారి సస్పెన్షన్కు గురయ్యారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వంచించాడన్న కారణంగా గుంటూరు జిల్లా నగరంపాలెం సీఐ వెంకటరెడ్డిపై వేటు పడింది. ఓ వివాహిత మహిళను వంచించి వెంకటరెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో బాధితురాలు.. వెంకటరెడ్డి తనను మోసం చేశారని అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విషయం ఐజీ దృష్టికి సైతం వెళ్లడంతో ఆయన విచారణ జరిపించారు. విచారణలో వెంకటరెడ్డిపై మహిళ చేసిన ఆరోపణలు నిజమేనని తెలుసుకున్నారు. దీంతో వెంకటరెడ్డిని సస్పెండ్ చేశారు.
గుంటూరు జిల్లాలో కొంతకాలం నుంచి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇప్పటికే ఇలాంటి ఆరోపణల కారణంగా ఇద్దరు ఎస్ఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా ఇదే రకమైన ఆరోపణల కారణంగా ఓ సీఐ సస్పెండ్ కావడంతో... ఇలాంటి వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరిస్తామని ఉన్నతాధికారులు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టయ్యింది.
Published by:
Kishore Akkaladevi
First published:
February 18, 2020, 12:09 PM IST