Home /News /crime /

CI SESHA RAO DEATH MYSTERY REVEALED AND CC FOOTAGE CLEARLY SHOWS IT WAS AN ACCIDENTAL DEATH SSR

CI Sesha Rao: సీఐ అనుమానాస్పద మృతి కేసులో ఊహించని ట్విస్ట్.. బల్లి వల్ల చనిపోయినట్లు.

సీసీటీవీ దృశ్యం(ఇన్‌సెట్‌లో శేషారావు ఫైల్ ఫొటో)

సీసీటీవీ దృశ్యం(ఇన్‌సెట్‌లో శేషారావు ఫైల్ ఫొటో)

నెల్లూరు ఎస్పీ వద్ద వీఆర్‌లో ఉన్న సీఐ కాకర్ల శేషారావు గుంటూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన డెత్ మిస్టరీ వెనకున్న చిక్కుముడి సీసీ ఫుటేజ్‌తో వీడింది. తన కుమార్తె మెడికల్ సీటు గురించి...

ఇంకా చదవండి ...
    గుంటూరు: నెల్లూరు ఎస్పీ వద్ద వీఆర్‌లో ఉన్న సీఐ కాకర్ల శేషారావు గుంటూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన డెత్ మిస్టరీ వెనకున్న చిక్కుముడి సీసీ ఫుటేజ్‌తో వీడింది. తన కుమార్తె మెడికల్ సీటు గురించి మాట్లాడేందుకు ఆయన గుంటూరు నగరంలోని పండరీపురంలో ఉన్న ఓ మహిళ ఇంటికి మార్చి 7న ఆదివారం రాత్రి వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో.. అక్కడ నిర్మాణంలో ఉన్న ఇంటి లిఫ్ట్ దగ్గర బల్లి కనిపించింది. దాన్ని చీపురుతో తరిమే క్రమంలో ఆయన భవనంపై నుంచి కిందపడ్డారు. పై నుంచి పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే.. ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. బల్లిని తరిమే క్రమంలో ఆయన గమనించకుండా పక్కకు ఒరిగి రెండో అంతస్తు నుంచి జారిపడినట్లు సీసీ ఫుటేజీతో స్పష్టమైంది.

    ఆమెతో కొన్నేళ్లుగా సీఐ సహజీవనం
    ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన శేషారావు గతంలో అచ్చంపేటలో పని చేస్తున్న సమయంలో గడ్డం ప్రసన్నలక్ష్మి అలియాస్‌ పాల్వాయి ప్రసన్నలక్ష్మితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నారు. శేషారావు తన కుటుంబంతో కలిసి చంద్రమౌళినగర్‌‌లో ఉంటున్నారు. పండరీపురం 4వ లైనులో ప్రసన్నలక్ష్మి ఉంటుంది. తన కూతురుని మెడిసిన్‌ చేర్పించే విషయమై మాట్లాడేందుకు ఆదివారం రాత్రి ప్రసన్నలక్ష్మి ఇంటికి ఆయన వెళ్లారు. రెండో అంతస్థులోకి వెళ్లగా ఆ సమయంలో ఆయనపై బల్లి పడిందని, దానిని తొలగించే క్రమంలో చీపురు తీసుకుని వెళుతూ లిఫ్టు కోసం పగలగొట్టిన ఖానాలో జారి పడినట్టు ప్రసన్నలక్ష్మి చెప్పింది. తాజాగా.. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆమె చెప్పిందే నిజమని తేల్చారు.

    శేషారావును ప్రసన్నలక్ష్మి, ఆమె కుమారుడు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన శేషారావు చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. ప్రసన్నలక్ష్మి ఇచ్చిన సమాచారంతో భార్య, పిల్లలు ఆస్పత్రికి చేరుకున్నారు. సోమవారం భార్య మధురవాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు సీఐ మృతి వెనకున్న మిస్టరీని తేల్చారు. సీఐ శేషారావు ప్రసన్నలక్ష్మితో సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఓ రాజకీయ నాయకుడిని రూ.కోట్లలో మోసం చేసినట్టు గతంలో కేసు నమోదైంది. ఆ కేసులో ప్రసన్నలక్ష్మితోపాటు శేషారావు కూడా అరెస్టు అయ్యారు. దీంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. చాలాకాలం సస్పెన్షన్‌లో ఉన్న శేషారావుపై ఆ తర్వాత సస్పెన్షన్‌ ఎత్తివేయటంతో కొంతకాలంగా నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో వీఆర్‌లో ఉన్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Guntur, Nellore

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు