ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతుల నంబర్లు సేకరించి.. సీఐ మన్మథలీలలు..

గతంలో పనిచేసిన పోలీసు స్టేషన్లలోనూ ఇదే తరహాలో సీఐ మణివణ్ణన్ మన్మథ లీలలు సాగించినట్టు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది.

news18-telugu
Updated: July 10, 2020, 12:49 PM IST
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతుల నంబర్లు సేకరించి.. సీఐ మన్మథలీలలు..
సీఐ మణివణ్ణన్
  • Share this:
అతడు ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్. వివిధ ఇబ్బందులతో పోలీసు స్టేషన్‌కు వచ్చేవారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారికి న్యాయం చేయడం అతడి విధి. కానీ ఆ సీఐ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వక్రబుద్ధి చూపించాడు. పలు ఇబ్బందులతో ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చే అందమైన యువతులు, మహిళల ఫోన్ నంబర్లు తీసుకుని వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. రాత్రి వేళల్లో ఫోన్లు చేసి ప్రేమపాఠాలు వల్లించేవాడు. కానీ తీరా విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఉన్న ఉద్యోగం పొగొట్టుకోవడమే కాక కటకటలాపాలయ్యే పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మన్నచ్చనల్లూరు సిరువనూరు పోలీసు స్టేషన్‌లో మనివణ్ణన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు.

వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేసి ఇక్కడకు బదిలీపై వచ్చాడు. అయితే సీఐ మణివణ్ణన్.. వివిధ సమస్యలతో పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలు, అందమైన యువతులను లక్ష్యంగా చేసుకుని వారి నంబర్లు సేకరించేవాడు. అలాంటి వారు స్టేషన్‌కు ఎవరూ వచ్చినా అతడి గదిలోకి పిలిపించుకుని మరీ ఫిర్యాదులు తీసుకునేవాడు. విచారణ పేరుతో రాత్రి వేళల్లో ఫోన్ చేసి మాటలు కలిపేవాడు. మెల్లిగా ప్రేమ పాఠాలు మొదలుపెట్టేవాడు. ఈ క్రమంలోనే స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు.

ఆ యువతి సీఐ మణివణ్ణన్‌కు లొంగకపోవడంతో ఆమె పైనే కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. దీంతో విసిగిపోయిన ఆ యువతి నేరుగా డీఐజీ బాలకృష్ణన్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. తన వద్ద ఉన్న ఆడియో రికార్డులను సైతం అందించింది. దీనిపై డీఐజీ బాలకృష్ణన్ రహస్యంగా విచారణ జరిపించారు. ఆ విచారణలో ఫిర్యాదు చేసిన యువతినే కాకుండా చాలామంది మహిళలు, యువతులను వేధింపులకు గురి చేసినట్టు తేలింది.

గతంలో పనిచేసిన పోలీసు స్టేషన్లలోనూ ఇదే తరహాలో సీఐ మణివణ్ణన్ మన్మథ లీలలు సాగించినట్టు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న డీఐజీ బాలకృష్ణన్.. సీఐ ఇంకా విధుల్లో కొనసాగితే ఫిర్యాదు చేసేందుకు వచ్చే యువతులు, మహిళలకు రక్షణ లేకుండా పోతుందని భావించారు. అందుకు అనుగుణంగా మణివణ్ణన్ విధుల్లో కొనసాగేందుకు వీలు లేదని ఆదేశిస్తూ... బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.

వాస్తవానికి మణివణ్ణన్ పదవీ విరమణ చేసేందుకు ఆరేళ్ల సమయం ఉన్నా.. ముందుగానే అతడి చేత బలవంతంగా పదవీ విరమణ చేయించేంుదకు సర్వం సిద్ధం చేశారు. దీంతో సీఐ మణివణ్ణన్ సెలవుపై వెళ్లారు. ఈ క్రమంలో డీఐజీ మారారు. దీంతో మణివణ్ణన్ తాజాగా మళ్లీ పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్ష్యమయ్యారు. డీఐజీ మారడంతో తన ఉద్యోగానికి ఢోకా లేదని భావించిన సీఐ మణివణ్ణన్‌కు ఊహించని షాక్ తగిలింది. విధుల్లో చేరేందుకు స్టేషన్‌కు వెళ్లిన అతడికి అక్కడి సిబ్బంది డీఐజీ బాలకృష్ణన్ అప్పటికే జారీ చేసిన ఉత్తర్వులను మణివణ్ణన్ చేతిలో పెట్టారు. దీంతో సీఐ మణివణ్ణన్ వెనుదిరగక తప్పలేదు.
Published by: Narsimha Badhini
First published: July 10, 2020, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading