హోమ్ /వార్తలు /క్రైమ్ /

Kurnool : మర్మాంగాన్ని వారి చేతుల్లో పెట్టి.. చర్చిలోనే ప్రార్థన పేరుతో బాలికలపై పాస్టర్ పైశాచికం -షాకింగ్ ట్విస్ట్

Kurnool : మర్మాంగాన్ని వారి చేతుల్లో పెట్టి.. చర్చిలోనే ప్రార్థన పేరుతో బాలికలపై పాస్టర్ పైశాచికం -షాకింగ్ ట్విస్ట్

నిందితుడు పాస్టర్ ప్రసన్న కుమార్

నిందితుడు పాస్టర్ ప్రసన్న కుమార్

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామంలో చర్చి నిర్వహించే పాస్టర్ ప్రసన్న కుమార్ అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రార్థన పేరుతో చర్చికి పిలిచిన పాస్టర్.. తన మర్మాంగాన్ని తీసి వారి చేతులతో పట్టించి బాలికల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటనలో కేసు నమోదైంది.

ఇంకా చదవండి ...

మత గురువుగా ప్రజల్ని ఆథ్యాత్మికతలో నడింపిచాల్సిన అతను.. దారి తప్పాడు. పవిత్రంగా భావించే చర్చిలోనే ఆడ పిల్లలపై పైశాచికానికి ఒడిగట్టాడు. తన వద్దకు వచ్చిన బాలికలను ప్రార్థన పేరుతో లైంగికంగా వేధించాడు. పాస్టర్ చేస్తోన్న అకృత్యాన్ని బాధిత బాలికలు ఇంట్లో వాళ్లకు చెప్పుకుని ఏడ్చారు. కానీ, సదరు పాస్టర్ తన పలుకుపబడిని ఉపయోగించి, తండ్రి లేని ఆ బాలికలను సెటిల్మెంట్ కు ఒప్పించాడు. గ్రామ పెద్దలకు సైతం డబ్బులు ఎరగా వేశాడు. అయితే సత్యం ఎన్నటికీ దాగదన్న బైబిల్ ఉవాచ ప్రకారమే అతని లీలలు బయటపడ్డాయి. చర్చిలో పాస్టర్ లైంగిక అకృత్యాలకు సంబంధించిన వీడియోలు సంచలనం రేపడంతో పోలీసులు రంగంలోకి దిగి అతణ్ని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాలో కలకలం రేపిన ఈ సంఘటనపై చాగలమర్రి పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలివి..

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామంలో చర్చి నిర్వహించే పాస్టర్ ప్రసన్న కుమార్ అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. గ్రామంలో చర్చిని నిర్వహిస్తోన్న ప్రసన్న కుమార్.. పెద్దవాళ్లంతా పనుల నిమిత్తం బయటికి వెళ్లిపోగా, ప్రార్థన పేరుతో పిల్లలకు చర్చికి పిలిపించేవాడు. ఆ క్రమంలో కొందరు బాలికలతో పాస్టర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇతని వికృత చేష్టలకు చాలా మంది పిల్లలు ఇబ్బంది పడగా, చివరికి ఇద్దరు బాలికల వ్యవహారంలో దొరికిపోయాడు..

గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో కష్టపడి కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్ల్ని చదివించుకుంటున్నది. తల్లి పనిలోకి వెళ్లగా ఇంట్లోనే ఉన్న ఇద్దరు బాలికలను పాస్టర్ ప్రసన్న కుమార్ ప్రార్థన కోసం పిలిచాడు. ప్రార్థన పేరుతో చర్చికి పిలిచిన పాస్టర్.. తన మర్మాంగాన్ని తీసి వారి చేతులతో పట్టించి బాలికల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. పాస్టర్ చర్యకు షాక్ తిన్న ఆ ఇద్దరు పిల్లలు.. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లికి జరిగిన ఘోరాన్ని చెప్పారు. దీంతో కంగుతిన్న ఆ తల్లి పాస్టర్ ను నిలదీసేందుకు సిద్ధమైంది. కానీ..

లైంగిక వేదింపుల విషయాన్ని మైనర్ బాలికలు తమ తల్లికి చెప్పారన్న విషయం తెలుసుకున్న పాస్టర్ ప్రసన్న కుమార్ తన పలుకుపబడిని ఉపయోగించి ఊరి పెద్దల ద్వారా సెటిల్మెంట్ కుదుర్చుకున్నాడు. బాధిత బాలికలకు రూ.50 వేలు పరిహారంగా ఇచ్చేందుకు అంగీకరించిన పాస్టర్.. ఈ సెటిల్మెంట్ చేసినందుకుగానూ ఊరి పెద్దలకు రూ.10వేలు ముట్టజెప్పాడు. పోలీస్ కేసు కాకుండా మరో రూ.5వేలూ ఇచ్చాడు. కాగా, అనూహ్య రీతిలో పాస్టర్ ప్రసన్న కుమార్ అకృత్యం వీడియో ఒకటి బయటపడింది. బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతోన్న వీడియో శెట్టివీడుతోపాటు కర్నూలు జిల్లా అంతటా వైరలైంది. ఈ ఘటనపై పలు న్యూస్ చానళ్లలో వార్తలు కూడా ప్రసారం అయ్యాయి. దీంతో చాగలమర్రి పోలీసులు ఎంట్రీ ఇవ్వక తప్పలేదు..

మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు, దాన్ని కప్పి పుచ్చుకోడానికి డబ్బుల సెటిల్మెంట్ తదితర వ్యవహారాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. చట్టం అండగా ఉంటుందని పోలీసులు భరోసా ఇవ్వడంతో చివరికి బాధిత కుటుంబం పాస్టర్ పై ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చింది. పాస్టర్ ప్రసన్న కుమార్ పై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చాగలమర్రి పోలీసులు తెలిపారు. భయం వల్లో మరే ఇతర కారణం చేతో బాధితులు ఫిర్యాదులు చేయకుండా ఉండొద్దని, కీచకుల ఆట కట్టించాలంటే బాధితులు ధైర్యంగా ముందురావాలని పోలీసులు సూచించారు.

Published by:Madhu Kota
First published:

Tags: AP News, Kurnool, Minor girl, Sexual harrassment

ఉత్తమ కథలు