చిత్తూరు జిల్లాలో బాలికకు వేధింపులు.. గ్రామస్థులంతా కలిసి..

ఏపీలోని చిత్తూరు జిల్లా బీ.కొత్తకోట మండలం గట్టులో ఓ యువకుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. నిన్న పాఠశాలకు వెళ్తుండగా ఓ విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడుతూ, వేధించాడని కొట్టినట్లు గ్రామ ప్రజలు తెలిపారు.

news18-telugu
Updated: December 1, 2019, 1:06 PM IST
చిత్తూరు జిల్లాలో బాలికకు వేధింపులు.. గ్రామస్థులంతా కలిసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహిళలకు లైంగిక, మానసిక వేధింపులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొన్న వరంగల్‌లో, నిన్న శంషాబాద్‌లో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా కామాంధులకు, అమ్మాయిలను ఏడిపించేవాళ్లకు బుద్ధి రావడం లేదు. తాజాగా.. శంషాబాద్‌లో యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటన సమాజాన్ని తలదించుకునేలా చేసింది. అయితే.. ఆ ఘటన మరువకముందే చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు బాలికను వేధింపులకు గురిచేశాడు. ఏపీలోని చిత్తూరు జిల్లా బీ.కొత్తకోట మండలం గట్టులో ఓ యువకుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. నిన్న పాఠశాలకు వెళ్తుండగా ఓ విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడుతూ, వేధించాడని కొట్టినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. అనంతరం పోలీసులకు అప్పగించి, కేసు నమోదు చేయించారు.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>