ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతి

ఈ దుర్ఘటనలో రామకృష్ణా రెడ్డి, రాజా రెడ్డి, చంద్రా రెడ్డి అనే ముగ్గురు యువకులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

news18-telugu
Updated: December 2, 2019, 7:13 AM IST
ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతిచెందారు. అతివేగం వల్లే ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పెద్దపంజాణి మండలం కోగిలేరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో రామకృష్ణా రెడ్డి, రాజా రెడ్డి, చంద్రా రెడ్డి అనే ముగ్గురు యువకులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే చిత్తూరు ప్రజలను వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. పలమనేరు సమీపంలో కొన్ని రోజుల క్రితం మొగిలి ఘాట్ రోడ్డువద్ద కంటైనర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>