చిత్తూరులో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తపై..

పెళ్లైనా వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందో మహిళ. అతడితో చనువుగా ఉంటూ భర్త కంటపడింది. గట్టిగా మందలించడంతో భర్తపై కక్ష కట్టిందామె.

news18-telugu
Updated: January 7, 2020, 9:00 AM IST
చిత్తూరులో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తపై..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లైనా వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందో మహిళ. అతడితో చనువుగా ఉంటూ భర్త కంటపడింది. గట్టిగా మందలించడంతో భర్తపై కక్ష కట్టిందామె. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని పన్నాగం పన్నింది. అయితే.. తృటితో తప్పించుకొని గాయాలతో భయటపట్టాడు ఆ భర్త. లేకపోయుంటే వారిద్దరి చేతిలో హతమయ్యేవాడే. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లిలో చోటుచేసుకుంది. భారతి, గోపాల్ ఇద్దరు దంపతులు. భారతికి దినకర్ అనే వ్యక్తితో పరిచయమైంది. వారిద్దరూ చనువుగా మెలిగారు. అది చూసిన గోపాల్.. ఆమెను వారించాడు. దీంతో.. తమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని, అతడ్ని తొలగించుకోవాలని దినకర్‌తో కలిసి స్కెచ్ వేసింది.

నిద్రిస్తున్న సమయంలో గోపాల్‌పై కత్తితో దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే గోపాల్ నిద్రపోయాక.. ప్రియుడితో కలిసి వచ్చి చంపేందుకు ప్రయత్నించింది. ఇంతలో మెలకువ వచ్చిన బాధితుడు.. అక్కడి నుంచి భయంతో పరుగులు తీశాడు. స్థానికులు అతడ్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 7, 2020, 9:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading