చిత్తూరు జిల్లాలో విద్యార్థినితో హెడ్ మాస్టర్ అసభ్యప్రవర్తన, చితకబాదిన గ్రామస్తులు

Chittoor HM beaten by Villagers | 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి, నీచానికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: August 21, 2020, 10:43 PM IST
చిత్తూరు జిల్లాలో విద్యార్థినితో హెడ్ మాస్టర్ అసభ్యప్రవర్తన, చితకబాదిన గ్రామస్తులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Head Master misbehaving with student | విద్యార్థులకు నీతులు చెప్పాల్సిన వాడు, తన దగ్గర చదువుకోసం వచ్చిన వారిని కన్నబిడ్డల్లా సాకాల్సిన ఓ ప్రధానోపాధ్యుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిని గ్రామస్తులు చితకబాదారు. చిత్తూరు జిల్లా సోమల మండలం కందురులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కీచకుడి అవతారం ఎత్తాడు. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి, నీచానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపింది. కుటుంబసభ్యులు ప్రధానోపాధ్యుడు నారాయణ మీద గ్రామస్తులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామస్తులు అందరూ కలసి నారాయణకు దేహశుద్ధి చేశారు. బాధిత బాలిక తండ్రి సోమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు నారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 21, 2020, 10:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading