చిత్తూరు జిల్లాలో చిన్నారి వర్షితపై హత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్..

మదనపల్లెలోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు రఫీ గతంలోనూ పలుమార్లు చిన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు.

news18-telugu
Updated: November 16, 2019, 4:04 PM IST
చిత్తూరు జిల్లాలో చిన్నారి వర్షితపై హత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్..
బాధితురాలు వర్షిత, హంతకుడు రఫి
  • Share this:
చిత్తూరు జిల్లాలో చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా బసినికొండకు చెందిన లారీ డ్రైవర్ రఫీ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ అరెస్టు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. నిందితుడు మమ్మద్ రఫీ కురభల కోట మండలం మొలకల వారి పల్లి అంగల్లు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు వయసు 25 సంవత్సరాలు. రఫీ గతంలో కూడా ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు వర్షిత ను సెల్ఫీ మోజులో దృష్టిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఓ పెళ్లివేడుకకు హాజరైన సమయంలో రఫీ బాలికను మచ్చిక చేసుకున్నాడు. ఆమె ఫొటోలు తీసి.. ఆమెకు దగ్గరయ్యాడు. ఆ రోజు రాత్రి 9.50 గంటల తర్వాత చిన్నారి కనిపించకుండా పోయింది. అయితే, బాలిక మీద అత్యాచారం చేసి.. హత్య చేసిన రఫీ.. అనంతరం ఓ సెలూన్‌కి వెళ్లి పూర్తిగా షేవింగ్ చేయించుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి జార్ఖండ్ పారిపోయాడు.

వర్షిత (File)


నిందితుడిని పట్టిచ్చిన రెడ్ కలర్ బూట్లు..
ఘటన జరిగిన రోజు రఫీ మద్యం తాగి ఓ పెళ్లికి వెళ్లాడు. అక్కడ భోజనాల దగ్గర ఐస్‌క్రీమ్ కోసం గొడవపడ్డాడు. వంటవాళ్ల దగ్గరకు వెళ్లి వారితోనూ గొడవపెట్టుకున్నాడు. అనంతరం వర్షిత మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరోజు సీసీటీవీలో కనిపించిన దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడి ఊహాచిత్రాలు గీయించారు. దీంతోపాటు అతడు వేసుకున్న ఎర్రబూట్లపై కూడా పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఆ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల్లో నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో నిందితుడు వేసుకున్న ఎరుపు రంగు బూట్లను చూసి గుర్తించి కొందరు ఈ బూట్లు రఫీవేనని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని నిందితుడి భార్య కూడా అలాంటి బూట్లు తన భర్త వేసుకుంటాడని ధ్రువీకరించింది.

హంతకుడు రఫీ (Fil)


ఈ క్రమంలో నిందితుడి కోసం 15 బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, మదనపల్లెలోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు రఫీ గతంలోనూ పలుమార్లు చిన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ సమయంలో అతడిని చితకబాదినా.. బుద్ధి మారలేదని, ఇప్పుడు ఏకంగా ఓ బాలికను పొట్టనపెట్టుకున్నాడని మండిపడుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 16, 2019, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading