చీరాల యువకుడి మృతి కేసులో ఎస్ఐ అరెస్ట్...

చీరాల టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: August 1, 2020, 10:46 PM IST
చీరాల యువకుడి మృతి కేసులో ఎస్ఐ అరెస్ట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చీరాల టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 18న మాస్క్ పెట్టుకోలేదని యువకుడిపై ఎస్సై దాడి చేశారు. తలకు గాయం కావడంతో కిరణ్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. యువకుడు మృతిపై గుంటూరు అడిషనల్ ఎస్పీ గంగాధర్ విచారణ చేపట్టారు. ఇప్పటికే ఎస్సై విజయ్ కుమార్‌ను ఎస్పీ సిద్దార్థ కౌశల్ సస్పెండ్ చేశారు.

మాస్క్ పెట్టుకోలేదన్న కారణంగా పోలీసుల దాడి వల్ల చనిపోయాడని ఆరోపణలు ఉన్న దళిత యువకుడి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు . ప్రకాశం జిల్లా చీరాలలో ఈ ఘటన జూలై 18న ఘటన జరిగింది. ఆ తర్వాత బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 2న రాత్రి చనిపోయాడు.

యారిచర్ల కిరణ్ కుమార్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. లాక్ డౌన్ కారణంగా సొంతూరు చీరాలలోని థామస్ పేటకు వచ్చాడు. జూలై 18వ తేదీన తన స్నేహితుడు అబ్రహాంతో కలసి బైక్ మీద వస్తుండగా కొత్తపేట చెక్ పోస్టు వద్ద ఓ కానిస్టేబుల్ వారిని ఆపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడానికి వారిని ఆపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్, యువకుల మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ సందర్భంగా కానిస్టేబుల్ వారిపై చేయి చేసుకుని, ఆ తర్వాత రూల్స్ గురించి మాట్లాడారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అనంతరం కానిస్టేబుల్ తమ ఎస్ఐ విజయ్ కుమార్‌ను పిలిపించారు. ఇద్దరు యువకులను ఎస్ఐ జీపులోకి నెట్టారు.

జీపులో పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా, కిరణ్ పారిపోవడానికి ప్రయత్నించి.. జీపులో నుంచి జంప్ చేశాడని, ఈ సందర్భంగా అతడి తలకు బలమైన గాయమైందని పోలీసులు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రక్తపు మరకలు రోడ్డు మీద ఉన్నాయని, అతడి జుట్టు కూడా అక్కడ లభించిందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. వారిద్దరూ మద్యం తాగి ఉన్నారని పోలీసులు చెప్పారు. కిరణ్ బ్లడ్ రిపోర్టులో 122 ఎంఎల్ ఆల్కహాల్ ఉందని రిపోర్టులో ఉన్నట్టు చెప్పారు. ఘటన జరిగిన తర్వాత కిరణ్‌ను చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు చనిపోయాడు. కిరణ్ పోలీసు కస్టడీలోనే చనిపోయినట్టు ఎస్పీ చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 1, 2020, 10:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading