గుట్టు రట్టు చేశాడని హెడ్ కానిస్టేబుల్‌ను చావబాదిన పోలీసులు?

డ్ కానిస్టేబుల్ మీడియాకు విషయాన్ని లీక్ చేసినట్టు పై అధికారులకు తెలిసింది. దీంతో అతడిని చింతూరు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ కొట్టినట్టు బాధితుడు ఆరోపించారు.

news18-telugu
Updated: October 7, 2019, 8:20 PM IST
గుట్టు రట్టు చేశాడని హెడ్ కానిస్టేబుల్‌ను చావబాదిన పోలీసులు?
ప్రతీకాత్మక చిత్రం (PTI photo)
  • Share this:
మన్యంలో గంజాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్న పోలీసుల గుట్టును రట్టు చేశాడన్న కోపంతో ఓ హెడ్ కానిస్టేబుల్ మీద తోటి పోలీసులే దాడి చేశారు. దీంతో అవమానం తట్టుకోలేక హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంటానంటూ భార్యకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. కొన్ని రోజుల క్రితం చింతూరు మండలం మోతుగూడెం వద్ద గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ కారును పోలీసులు ఆపారు. అయితే, రవాణా చేస్తున్న వారి వద్ద నుంచి మోతుగూడెం ఎస్ఐ కుటుంబరావు డబ్బులు తీసుకుని వారిని వదిలేసినట్టు ఓ హెడ్ కానిస్టేబుల్ మీడియాకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులతో చేతులు కలిపి కారును వదిలిపెట్టారని తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ మీడియాకు విషయాన్ని లీక్ చేసినట్టు పై అధికారులకు తెలిసింది. దీంతో అతడిని చింతూరు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ కొట్టినట్టు హెడ్ కానిస్టేబుల్ ఆరోపించారు. గంజాయి రవాణాపై మీడియాకు సమాచారం ఇచ్చిన హెడ్ కానిస్టేబుల్ ను కలిసేందుకు వెళ్లిన మీడియాను గేటువద్దే నిలిపివేశారు. హెడ్ కానిస్టేబుల్‌ను కనిపించకుండా చేశారు.

First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading