HOME »NEWS »CRIME »chinese man tied and thrown into river after he was caught cheating with mistress by wife details here ms

పరాయి మహిళతో ఆ పనిలో ఉండగా దొరికిపోయిన భర్త.. భార్య ఏం చేసిందంటే...

పరాయి మహిళతో ఆ పనిలో ఉండగా దొరికిపోయిన భర్త.. భార్య ఏం చేసిందంటే...
ప్రతీకాత్మక చిత్రం

బయటకు వెళ్లినప్పుడు పరాయి ఆడదాన్ని చూచాయగా చూసినా... ‘అంత భాగుందా..? దాని వైపు కన్నార్పకుండా చూస్తున్నావ్.. ఇంటికి పద నీ సంగతి చెబుతా..’ అంటారు భార్యామణులు. ఇక అలాంటిది భర్త మరో మహిళతో ఆ పని చేసేటపుడు చూస్తే ఇంకేమైనా ఉందా...!

  • News18
  • Last Updated: November 26, 2020, 21:04 IST
  • Share this:
    భర్త తనకు మాత్రమే సొంతమవాలనుకుంటారు భార్యలు. ఆయన గారి విన్యాసాలు, సాహసాలు, సేవలు ఆవిడగారికే దక్కాలని కోరుకుంటారే తప్ప పరాయి ఆడవాళ్లందరికీ పంచుతానంటే అస్సలు ఒప్పుకోరు. బయటకు ఎటైనా వెళ్లినప్పుడు పరాయి ఆడదాన్ని చూసినా... ‘అంత భాగుందా..? దాని వైపు కన్నార్పకుండా చూస్తున్నావ్.. ఇంటికి పద నీ సంగతి చెబుతా..’ అంటారు భార్యామణులు. ఇక అలాంటిది భర్త మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉంటే..? ఆ సాన్నిహిత్యం వారిద్దరి మధ్య శృంగార బంధానికి దారి తీస్తే...? వారిద్దరూ ఆ పని చేసుకునేప్పుడు ఊహించని రీతిలో భార్య ఆ గదిలోకి వస్తే....? ఆ భార్య అపర కాళిలా మారాల్సిందే. అలాగే చేసింది ఒక భార్య. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

    చైనాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. వివరాల్లోకెళ్తే... దక్షిణ చైనాలోని మావోమింగ్ కు చెందిన మహిళ తన భర్త చేసిన పనికి కోపంతో ఊగిపోయింది. తన భర్త వేరే మహిళతో కులుకుతూ ఉండగా హఠాత్తుగా అక్కడకు వెళ్లింది ఆ భార్య. అంతకుముందే.. ఆ మహిళతో సంబంధం తెంచుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఆమె భర్త వినలేదు. దీంతో ఈసారి ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని నలుగురు వ్యక్తులతో కలిసి భర్త ఉండే చోటుకు వచ్చింది. సరాసరి.. భర్త, మరో మహిళ ఉండే గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఆయనగారు.. పరాయి మహిళతో శృంగారం చేసే పనిలో ఉన్నారు. ఇది చూసిన భార్య గట్టిగా అరిచింది. దాంతో మరో మహిళ.. అకస్మాత్తుగా మంచం మీద నుంచి లేచి.. పక్కనే ఉన్న టవల్ తో తన శీలాన్ని దాచుకోవడానికి ప్రయత్నించింది.



    నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ.. మహిళల వద్ద లక్షలు వసూలు చేసిన మోసగాడు

    ఇక ఆ భార్య కోపానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఆగ్రహంతో భర్తను అదే మంచానికి కట్టేసింది. ఇందుకు తనతో వచ్చిన నలుగురి సాయం తీసుకుంది. ఆ తర్వాత వాళ్లు అతడికి బడితె పూజ చేశారు. ఆపై అతడిని ఒక బోను లాంటి ప్రదేశంలో కట్టేసి... పక్కనే పారుతున్న నదిలో విసిరేశారు. బయటకు వెళ్లడానికి వీల్లేకుండా తాళ్లతో గట్టిగా కట్టి నీళ్లలో విసిరేయడంతో.. ఆ వ్యక్తి ఎటూ వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. చివరికి చాలా దూరం ఆ ప్రవాహంలో కొట్టుకెళ్లి.. ఒక కంక పొద దగ్గర చిక్కుకున్నాడు. ఇది చూసిన పలువురు స్థానికులు నదిలోకి వెళ్లి అతడిని బయటకు తీసుకొచ్చారు.

    ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    చైనాలో పూర్వకాలంలో.. ఎవరైనా వ్యక్తి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇలాగే శిక్షించేవారట. అతడు లేదా ఆమెను ఒక బోనులో కట్టేసి.. దానిని నదిలో పడేసేవారట. దీంతో ఆ బోనులో ఉన్న వ్యక్తి నీటి ప్రవాహానికి కొట్టకుని పోయి.. ఎటూ వెళ్లడానికి వీల్లేకుండా ఉండేది. ఆ నీటిలోనే జల సమాధి అయ్యేవారు.
    Published by:Srinivas Munigala
    First published:November 26, 2020, 21:04 IST

    टॉप स्टोरीज