పెంపుడు కుక్కకు పేరు పెట్టినందుకు... చైనాలో యువకుడి అరెస్ట్...

తన పెంపుడు కుక్కలకు వింతైన పేర్లు పెట్టినందుకు కటకటాల పాలైన చైనా యువకుడు... పది రోజుల జైలుశిక్ష విధించిన కోర్టు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 19, 2019, 8:25 PM IST
పెంపుడు కుక్కకు పేరు పెట్టినందుకు... చైనాలో యువకుడి అరెస్ట్...
కుక్కలకు ఆ పేర్లు పెట్టినందుకు... యువకుడి అరెస్ట్...
  • Share this:
పెంపుడు కుక్కలను మనుషుల కంటే ఎంతో ఇష్టంగా, ప్రేమగా పెంచుకుంటారు చాలామంది. వాటికి పేరు పెట్టేందుకు ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు కూడా. అయితే చాలమటుకు కుక్కల పేర్లు అంటే ఏ టామీ, పప్పీ, స్కూబీ, రాకీ, రాజు, టైగర్, జూమీ.. ఇలా ఉంటాయి. కొందరైతే ‘అమ్మ రాజీనామా’ సినిమాలో సత్యనారాయణలా ‘వెంకటేశ్వర్‌రావు’ అని తన బాస్ పేర్లు, కోపం ఉన్న, మనుషుల పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. అయితే చైనాలో మాత్రం 30 ఏళ్ల బాన్ అనే యువకుడు మాత్రం తన పెంపుడు కుక్కలకు వింతైన పేర్లు పెట్టినందుకు కటకటాల పాలయ్యాడు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటనకు కారణం లేకపోలేదు. బాన్ ఎంతో ఇష్టంగా రెండు బుజ్జి కుక్కలను కొనుక్కున్నాడు. అందరిలా కాకుండా వాటికి వెరైటీ పేర్లు పెడదామని భావించి.. ఓ కుక్కకు ‘చెన్‌గువాన్’, మరో కుక్కకేమో ‘షీగువాన్’ అని పేర్లు పెట్టాడు. అయితే చైనీస్ భాషలో షీగువాన్ అంటే ట్రాఫిక్ పోలీసులు అని అర్థం. అలాంటి పేర్లు పెడితే పెట్టాడు కానీ కుక్కల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

చైనీస్ చట్టాల ప్రకారం ప్రభుత్వ సంస్థలు, పోలీసు సంస్థల పేర్లను పోలిన పేర్లు పెంపుడు జంతువులకు పెట్టడం నిషేధం. ఆ విషయం తెలియని బాన్... తన పెంపుడు కుక్కకు ఆ పేరు పెట్టాడు. మనోడికి వెతికి పట్టుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఎందుకిలా చేశారని కోర్టులో న్యాయమూర్తి ప్రశ్నిస్తే... ఏదో జోక్ చేద్దామని, సరదాకా ఆ పేరు పెట్టానని చెప్పుకొచ్చాడు బాన్. అయితే అతను చెప్పిన దాంట్లో జోక్ కనిపించని జడ్జి... మనోడికి పది రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించాడు.
First published: May 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading