భారత సంతతి అల్లుడిని చంపిన చైనా సంతతి వ్యాపారికి ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష

ప్రతీకాత్మక చిత్రం

భారత సంతతికి చెందిన తన అల్లుడిని హత్య చేసిన కేసులో చైనా సంతతికి చెందిన ఓ వ్యాపారికి న్యాయస్థానం జైలు శిక్ష విధించిది.

 • Share this:
  భారత సంతతికి చెందిన తన అల్లుడిని హత్య చేసిన కేసులో చైనా సంతతికి చెందిన ఓ వ్యాపారికి న్యాయస్థానం జైలు శిక్ష విధించిది. సింగపూర్‌లో 2017లో జరిగిన ఈ హ్యతకు సంబంధించిన విచారణ పూర్తవడంతో.. సోమవారం అతనికి ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాలు.. చైనా సంతతికి చెందిన తామ్ నామ్ సెంగ్ అనే వ్యాపారి తన కూతురును స్పెన్సర్ తుప్పానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత తన వ్యాపార బాధ్యతలను అల్లుడు తుప్పానికి అప్పగించాడు. అయితే ఆస్తి తనకు చేతికి చిక్కడంతో తుప్పానిలో మార్పు కనిపించింది. కంపెనీల ద్వారా వచ్చే ఆదాయాన్ని తన విలాసాలకు వాడుకోవడం ప్రారంభించారు. అలాగే భార్యతో అంతగా సంబంధాలు మెయింటేన్ చేసేవాడు కాదు.

  ఈ క్రమంలోనే తుప్పానికి విహేతర సంబంధాలు ఉన్నట్టు అతని భార్య గుర్తించింది. ఈ విషయంలో వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. కష్టపడి కింది స్థాయి నుంచి పైకి వచ్చిన సెంగ్ కూతురు బాధను చూడలేకపోయాడు. ఆ కోపంలోనే 2017 జూలై 10న ఓ కాఫీ షాప్ వద్ద ఉన్న అల్లుడిపై కత్తితో దాడికి దిగాడు. అందరు చూస్తుండగానే.. తుప్పాని నువ్వు చాలా తప్పు చేశావు అంటూ మూడు సార్లు కత్తితో పొడిచాడు. దీంతో తుప్పాని కిందపడిపోయాడు.. అతన్ని కాపాడేందకు ఎవ్వరూ ముందుకు రాకుండా సెంగ్ ఇతరులను బెదించాడు. "అతన్ని చనిపోవండి, నేను అతన్ని చంపాలని అనుకుంటున్నాను" అంటూ వ్యాఖ్యలు చేశాడు. అలాగే అతని ముఖంపై రెండుసార్లు తన్నాడు. తర్వాత కూతురికి ఫోన్ చేసి.. "నాకు రాత్రి నిద్రపట్టలేదు. నేను అతన్ని చంపేశాను. నువ్వు ఎడవకు. నేను ఇప్పటికే ముసలివాడినయ్యాను. జైలుకువెళ్లేందుకు నాకు భయం లేదు" అని అన్నాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని చేశారు.

  ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా తాను చేసిన నేరాన్ని సెంగ్ అంగీకరించాడు. ఈ క్రమంలోనే అతనికి 12 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. అతని ప్రతీకార స్వబావమని, అతనిలో చాలా ఆవేశం ఉందని, మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కోర్టుకు తెలిపారు. అందుకే తన అల్లుడిని పట్టపగలు, అందరు చూస్తుండగానే అతి క్రూరంగా చంపాడని చెప్పారు.

  అనంతరం డిఫెన్స్ లాయర్ వాదనలు వినిపిస్తూ.. సెంగ్‌కు ఏడున్నరేళ్లు జైలు శిక్ష విధించాలని కోరాడు. అతను ప్రైమరీ స్కూల్ విద్యను మాత్రమే పూర్తి చేశాడని, కూలీ స్థాయి నుంచి షిప్పింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ స్థాపించే స్థాయికు ఎదిగాడని చెప్పాడు. అలాగే సెంగ్ కూతురుని తుప్పానికి ఇచ్చి పెళ్లిచేసిన అనంతరం జరిగిన పరిణామాలను కూడా వివరించాడు. కోర్టు విచారణ సందర్భంగా తాను చేసిన నేరాన్ని సెంగ్ అంగీకరించాడు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దేదార్ సింగ్ గిల్.. సెంగ్ చేసినది దుర్మార్గపు చర్యగా అభిప్రాయపడ్డాడు. తన కూతరు శ్రేయస్సు గురించి ఆలోచించిన ఈ పని చేసి ఉంటాడని.. అయితే అతనిలో ఆవేశం ఎక్కవగా ఉందని మానసికంగా కూడా చాలా డిస్టర్బ్‌గా ఉన్నాడని చెప్పాడు. అతనికి జీవిత ఖైదు విధించవచ్చు కానీ 50 ఏళ్లు పైబడినందున ఆ శిక్షను విధించలేమని తెలిపాడు. అతనికి ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
  Published by:Sumanth Kanukula
  First published: