హోమ్ /వార్తలు /క్రైమ్ /

Earthquake In China : చైనాలో భారీ భూకంపం..ఎంతమంది చనిపోయారంటే..

Earthquake In China : చైనాలో భారీ భూకంపం..ఎంతమంది చనిపోయారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Earthquake In China : చైనా(China)లో భూకంపం(Earthquake) సంభవించింది. సోమవారం సిచువాన్‌ ప్రావిన్స్‌లోని లుండింగ్‌ కౌంటిలో 6.8తీవ్రతతో భారీ భూకంపం సంభవించి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.25 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 6.8 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Earthquake In China : చైనా(China)లో భూకంపం(Earthquake) సంభవించింది. సోమవారం సిచువాన్‌ ప్రావిన్స్‌లోని లుండింగ్‌ కౌంటిలో 6.8తీవ్రతతో భారీ భూకంపం సంభవించి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.25 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 6.8 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ప్రావిన్స్‌లోని కంగ్డింగ్ సిటీ సమీప ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో మార్పుల వల్ల భూకంపం చోటు చేసుకున్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. సిచువాన్​ రాజధాని చెంగ్డులోనూ భూమి కనిపించింది.

భూకంప తీవ్రతకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. సిచువాన్ ప్రావిన్స్‌లో భూకంపం కారణంగా పలు చోట్ల పర్వత కొండచరియలు విరిగిపడటం వలన గృహాలకు తీవ్రమైన నష్టం కలిగినట్లు సమాచారం. భూకంపం వల్ల ఏడుగురు మరణించారని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. టిబెట్‌ను ఆనుకొని ఉన్న సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. టిబెటన్ పీఠభూమిలోనూ తరచూ భూకంపాలు నమోదవుతూ ఉంటాయి.

OMG : రక్తసిక్తమైన కెనడా : సడెన్ గా వచ్చి కత్తులతో దాడులు..భారీగా మృతులు


2008లో సిచువాన్‌లో 7.9 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపానికి దాదాపు 90వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 2013 తర్వాత సిచువాన్ లో తాజాగా సంభవించినదే భూకంపమే మోస్ట్ పపర్ ఫుల్ అని తెలుస్తోంది. భూప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానిక అధికారులు సించువాన్ ప్రావిన్స్‌కు లెవెల్-2 రెస్పాన్స్‌ను జారీ చేశారు. లెవెట్-2 రెస్పాన్స్‌ను రెండో అతి తీవ్ర ప్రమాదకరమైన హెచ్చరికగా భావిస్తారు. ఈ హెచ్చరికలు జారీ అయిన వెంటనే స్థానిక డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్టిగేషన్ అండ్ రెస్క్కూ విభాగం అధికారులు అప్రమత్తం అయ్యారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: China, Earth quake

ఉత్తమ కథలు