20 నెలల పసికందుపై కన్నతండ్రి దారుణ చర్య... బోనులో బంధించి వీడియోలు...

20 నెలల పసికందును కుక్కల బోనులో బంధించి, కన్నతండ్రి వేధింపులు... చైనాలో వెలుగుచూసిన దారుణ సంఘటన...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 21, 2019, 9:11 PM IST
20 నెలల పసికందుపై కన్నతండ్రి దారుణ చర్య... బోనులో బంధించి వీడియోలు...
20 నెలల పసికందుపై కన్నతండ్రి దారుణ చర్య... బోనులో బంధించి వీడియోలు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 21, 2019, 9:11 PM IST
మాజీ భార్య మీద కోపంతో 20 నెలల చిన్నారిని బోనులో బంధించి, రాక్షస ఆనందం పొందాడో పైశాచిక తండ్రి. ఆ ఫోటోలను ఆమెకు పంపి, పైశాచిక ఆనందం పొందాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చైనాలోని గాంగ్‌డాంగ్ ప్రొవిన్స్ ఏరియాకు చెంది క్లూ కియాన్, టింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా జన్మించింది. అయితే పాప పుట్టిన తర్వాత భార్యాభర్తల మనస్పర్థలు మొదలయ్యాయి. దాంతో భర్త నుంచి విడాకులు తీసుకుని వెళ్లిపోయింది టింగ్. అయితే కూతుర్ని మాత్రం తండ్రి దగ్గరే వదిలేసి వెళ్లింది. తనను వదిలేసి వెళ్లిపోయిన మాజీ భార్యపై కక్ష పెంచుకున్న కియాన్... ఆ కోపాన్ని చిన్నారిపై చూపించడం మొదలెట్టాడు. 20 నెలల పసికందును కుక్కల బోనులో బంధించి, వేధించడం మొదలెట్టాడు. ఆ వీడియోలను, ఫోటోలను భార్యకు పంపుతూ శాడిస్ట్ ఆనందం పొందాడు. దాంతో ఆ తల్లి ప్రాణం విలవిలలాడిపోయింది. తన కూతుర్ని మాజీ భర్త నుంచి విడిపించి, తనకు ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది టింగ్. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు... చిన్నారిని చిత్రవధ చేస్తున్న కియాన్‌ను అరెస్ట్ చేశారు. మాజీ భార్యకు వాట్సాప్‌లో పంపిన వీడియోలు చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు.

చిన్నారిని కుక్కల బోనులో బంధించిన కియాన్... ఆమె అరచేతులు తొక్కుతూ, తలపై కాళ్లు పెడుతూ శాండిస్టులా వ్యవహారించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షం కావడంతో వైరల్ అయ్యాయి. బాలికపై అంత కర్కశంగా వ్యవహారించిన కియాన్‌ను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే కియాన్ మాత్రం తన పలుకుబడి ఉపయోగించి, బెయిల్ మీద విడుదల కావడం విశేషం.


First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...