భార్యను చంపి... ఉరి వేసుకున్న భర్త... అసలు కారణం ఇదీ...

Pune Crime : పెళ్లైన వారికి సంతానం కలగకపోవడం అన్నది ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లం. ఆ మాత్రం దానికే... అతిగా ఫీలవుతూ... ప్రాణాలు తియ్యడం, తీసుకోవడం సమంజసం కాదు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 29, 2019, 11:25 AM IST
భార్యను చంపి... ఉరి వేసుకున్న భర్త... అసలు కారణం ఇదీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టెక్ మహీంద్రలో పనిచేస్తున్న సంజయ్‌ (45)కీ వృషాలీ (44)కీ చాలా ఏళ్ల కిందటే పెళ్లైంది. పిల్లలు లేరు. ఇదే విషయమై ప్రతి రోజూ భార్యాభర్తలు బాధపడేవాళ్లు. చక్కటి జాబ్, మంచి శాలరీ. ఆమె ఇంట్లోనే ఉంటూ... భర్తతో కలిసిమెలిసి ఉండేది. అన్యోన్య దాంపత్యం. అంతా బాగానే ఉన్నా... సంతానం కలగకపోవడమనే విషయం వాళ్లను విపరీతంగా బాధపెట్టేది. ఎంతో మంది డాక్టర్లను కలిసారు. ఎన్నో సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగారు. అయినా ప్రయోజనం కలగలేదు. ఈ విషయాన్ని దైవానికే వదిలెయ్యమని చాలాసార్లు చెప్పాడు. కానీ ఆమె అలా సర్దుకుపోలేకపోయేది. సరిగా భోజనం చేసేది కాదు. ఎప్పుడు చూసినా ఏదో కలతతో బాధపడుతున్నట్లు ఉండేది. ఆమెకు నచ్చ చెప్పేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా వీలు కాలేదు. ఎన్ని చేసినా, ఏం చేసినా ఆమె మాత్రం... తనకు పిల్లలు పుట్టట్లేదనే విషయాన్నే పదే పదే తలచుకుంటూ... బాధపడుతూ... కాలం గడిపేది. రోజూ ఆమె అలా బాధపడటం చూసి తట్టుకోలేకపోయేవాడు సంజయ్.

ఓ రోజు ఆఫీస్ నుంచీ ఇంటికి వచ్చిన సంజయ్... ఎందుకో చాలా చిరాకులో ఉన్నాడు. ఆ సమయంలో అతిగా బాధపడుతున్న భార్యను చూశాడు. "నా ఖర్మ ఇంతే... ఏ నాడు ఏ పాపం చేశానో"... అంటూ అరగంటకు పైగా ఏడుస్తుండటంతో... అది చూసిన సంజయ్ తట్టుకోలేకపోయాడు. అతనిలో సహనం నసించిపోయింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు... ఏడవవద్దని... అంటూ ఆమెపై చిరాకు పడ్డాడు. దాంతో ఆమె మరింతగా ఏడవడం మొదలుపెట్టింది. అతనిలో సహనం మరింత తగ్గిపోయింది. చిరాకులో ఆమెను గట్టిగా తిట్టి... వెళ్లి నిద్రపోయాడు.

తెల్లారి ఆమె కంటే ముందే నిద్రలేచిన సంజయ్... గతమంతా తలచుకొని... తీవ్ర నిరాశ చెందాడు. ప్రతి రోజూ ఆమె బాధపడుతూ ఉండటాన్ని తలచుకొని... తీవ్ర ఆవేదన చెందాడు. ఎందుకో అతనికి జీవితంపై విరక్తి వచ్చేసింది. వెంటనే వెళ్లి... ఓ పాత సుత్తి తీసుకొచ్చి... ఆమె తలపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. అదే హడావుడిలో... మరో నాలుగైదు సార్లు కొట్టేశాడు. అంతే... బెడ్‌పై ఉన్న ఆమె... అదే బెడ్‌పై విలవిలలాడుతూ... రక్తపు మడుగులో... ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత... సంజయ్... అల్మరాలోని... తన భార్య చీరను ఫ్యాన్‌కి వేలాడదీసి... "నా భార్యంటే నాకెంతో ప్రేమ. ఆమె బాధను చూసి తట్టుకోలేక ఈ పని చేశాను" అని సూసైడ్ నోట్ రాసి... ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

పుణె... పింప్రి-చించ్వాద్‌లోని.. షిండే వస్తీ ఏరియాలో జరిగిందీ విషాద దారుణం. హత్య జరిగిన రోజున... ఆమెను సైకియాట్రిస్ట్ (మానసిక వేత్త) దగ్గరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వృషాలీ అక్క పోలీసులకు తెలిపారు. ఆ విషయమై... ఇంటికి వచ్చిన ఆమె... డోర్ ఎంతకీ తెరవకపోవడంతో... కిటికీలోంచీ లోపలికి చూసింది. షాకైంది. ఆ తర్వాత పోలీసులు రావడం, తలుపులు విరగొట్టి... లోపలికి వెళ్లడం, విషయం తెలుసుకోవడం అన్నీ జరిగాయి.ఈ రోజుల్లో పని ఒత్తిళ్లు, టెన్షన్లు, ఊబకాయం, జన్యు పరమైన సమస్యలు, పురుగు మందుల ఆహారం తినడం వంటి ఎన్నో కారణాల వల్ల సంతాన సమస్యలు ఏర్పడుతున్నాయి. పిల్లలు లేని వాళ్లు దత్తత తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అనాథ పిల్లలున్నారు. అంతే తప్ప... ఇలా ప్రాణాలు తియ్యడం, తీసుకోవడం ఏమాత్రం సరికాదు.
First published: August 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు