చిన్నపిల్లలపై అత్యాచారాలు,హత్యలతో సమాజంలోని కొన్ని మానవ మృగాలు చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తూ.. హత్యలు చేస్తున్న సంఘటన దేశవ్యాప్తంగా నమోదు అవుతున్నాయి. దీంతో ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటీ సంఘటనలు కామన్‌గా మారుతున్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ( child rape and murder by neibour) మరి దారుణంగా చిన్న పిల్లలను కిడ్నాప్‌లు చేయడం వారిపై అఘాయిత్యానికి పాల్పడడం, కనికరం లేకుండా వ్యవహరించి వారిని హతమార్చడం లాంటీ సంఘటనలు భయాందోళనలు కల్గిస్తున్నాయి.
ఇలా ఇటివల గంజాయికి అలవాటు పడిన రాజు అనే దుర్మర్గుడు సైదాబాద్ సమీపంలోని సింగరేణి కాలనీ గుడిసెల్లో ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, ఆ తర్వాత అత్యాచారం చేసి హత్య చేశాడు. దీంతో ఆ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా నిందితుడికి చివరికి ప్రజలకు కోరుకున్నట్టుగా తగిన శాస్తి జరిగింది.అయితే ఇలాంటీ సంఘటనే ఒకటి యూపీలో రోజుల క్రితమే చోటు చేసుకుంది. యూపీలోని
హపూర్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలిక రెండు రోజుల క్రితమే.. అనగా గడిచిన గురువాంర సాయంత్రం ఇంటి నుంచి చాక్లెట్ కొనుక్కుంటానని బయటకు వెళ్లింది.
UP News : కోటి రూపాయల రోడ్డు.. కొబ్బరి కాయ కొడితేనే.. పగిలిపోయింది.. షాక్ తిన్న ఎమ్మెల్యే ధర్నా
ఆ తర్వాత.. ( child rape and murder by neibour) ఎంత సేపటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన బాలిక తండ్రి ఆరోజు రాత్రంతా బాలిక కోసం వెతికారు. అయినా.. బాలిక ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయాన్నే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే అదే ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఇంటి తాళలను పగులగొట్టారు. దీంతో దుర్వాసనతో కూడిన ఓ ట్రక్కుపెట్టెను చూసి షాక్‌కు గురయ్యారు..
( child rape and murder by neibour) ఆ ట్రంక్ పెట్టెలో బట్టలు, బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే ఆ తర్వాత.. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. కాగా అంతకు ముందు అక్కడే ఉన్న స్థానికులు నిందితుడిని తమ అదుపులోకి తీసుకుని చితక బాదారు.
నిందితుడి అరెస్ట్ అనంతరం స్థానికంగా ఉన్న సీసీ టీవి ఫుటేజీని పరిశీలించారు.. ఆ బాలికను ఇంటి యజమాని బైక్ మీద కూర్చోబెట్టుకుని, అతని ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. ( child rape and murder by neibour) నిందితుడు ఆ బాలికపై అత్యాచారం చేసి , హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.రిపోర్టులు వచ్చాక.. పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దీంతో స్థానికులు ఆ నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేసి దాడికి పాల్పడ్డారు.బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.