Home /News /crime /

CHILAKALAGUDA POLICE FILES A CASE AGAINST TEENMAR MALLANNA AFTER A ASTROLOGER COMPLAINTS IN HYDERABAD VB

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై లక్ష్మీకాంత శర్మ కేసు.. తప్పడు వార్తలు ప్రచారం చేశాడంటూ ఆరోపణ.. అవి తప్పుడు వార్తలా.. నిజాలా..!! అసలేం జరిగింది..

తీన్మార్ మల్లన్న (ఫైల్ ఫోటో)

తీన్మార్ మల్లన్న (ఫైల్ ఫోటో)

Teenmar Mallanna:ప్రముఖ జర్నలిస్ట్, క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి ఫిర్యాదు మేరకు మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లన్న తన నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేశారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదులో ఆరోపించారు.

ఇంకా చదవండి ...
    తీన్మార్‌ మల్లన్న.. ఈ పేరు తెలియని వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఇటీవల నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఓట్లు సాధించి.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తీన్మార్‌ మల్లన్న చుక్కలు చూపించారు. చివరి వరకు పోరాడినా మల్లన్నకు ఓటమి తప్పలేదు. అయితే.. తాజాగా నవీన్ పై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి ఫిర్యాదు మేరకు మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేసాడని, ఇవ్వకుంటే తప్పుడు వార్తా కథనాలు ప్రచారం చేస్తానని బెదిరించినట్లు లక్ష్మి కాంత్ శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన యూట్యూబ్ ఛానెల్‌లో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాడన్నారు.  ఈ నెల 22న లక్ష్మీకాంత శర్మ నుంచి తమకు లిఖితపూర్వక ఫిర్యాదు అందడంతో మల్లన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేష్ తెలిపారు.

    అయితే ఇదిలా ఉండగా ఇటీవల 'లక్ష్మీకాంత శర్మ బాధితులు' పేరుతో తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానెల్‌లో కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. అందులో లక్ష్మీకాంత శర్మ బాధితులమని చెబుతూ కొంతమంది తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన తాయెత్తులు, లాకెట్లు ఇచ్చి మంచి జరుగుతుందని మోసం చేశాడని కొంతమంది బాధితులు వాపోయారు.

    అయితే అతడిపై కథనాలు ప్రచారం చేసినందుకు లక్ష్మీకాంత శర్మ తరుపున వారు అవి ప్రచారం చేయకుండా ఉండాలంటే మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని అడగ్గా.. లంచంతో మమ్మల్ని కొంటారా అంటూ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. లంచంతో లొంగదీసుకుందాం అనుకున్న వారికి తను లొంగక పోవడంతో ఇలా తనపై రివర్స్ కేసు పెట్టారని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చాడు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Chilakalaguda, Lakshmikant Sharma, Police Case, Teenmar Mallanna

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు