Home /News /crime /

CHICKEN WAS BITTEN THEN THE COBRA WAS ELECTROCUTED BY THE FURIOUS HEN OWNER SSR

Shocking Incident: ఏం మనుషులో.. పాముకు కరెంట్ షాక్ ఇచ్చి చంపబోయారు.. అసలేం జరిగిందంటే...

ఇంట్లో పాము, డబ్బాలో పామును ఉంచి మూత పెట్టిన దృశ్యం

ఇంట్లో పాము, డబ్బాలో పామును ఉంచి మూత పెట్టిన దృశ్యం

కాటేయడం పాము సహజ లక్షణం. అప్పుడప్పుడూ పాములు దారితప్పి జనావాసాల్లోకి వచ్చి, ఇళ్లలోకి జొరబడి బెంబేలెత్తిస్తుంటాయి. అలాంటి సమయాల్లో కొందరు వాటిని కొట్టి చంపేస్తుంటారు. మూగ జీవాలను ప్రేమించే వారైతే స్నేక్ క్యాచర్స్‌ను పిలిపించి.. ఆ పామును జనాలకు దూరంగా వదిలేస్తుంటారు.

ఇంకా చదవండి ...
    బేతుల్: కాటేయడం పాము సహజ లక్షణం. అప్పుడప్పుడూ పాములు దారితప్పి జనావాసాల్లోకి వచ్చి, ఇళ్లలోకి జొరబడి బెంబేలెత్తిస్తుంటాయి. అలాంటి సమయాల్లో కొందరు వాటిని కొట్టి చంపేస్తుంటారు. మూగ జీవాలను ప్రేమించే వారైతే స్నేక్ క్యాచర్స్‌ను పిలిపించి.. ఆ పామును జనాలకు దూరంగా వదిలేస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ పట్టణ పరిధిలోని ఓ గ్రామంలో ఈ రెండూ జరగలేదు. తన కోళ్లను కాటేసిందన్న కోపంతో పామును పట్టి.. దానిని ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించి.. ఆ పాముకు కరెంట్ షాక్ ఇచ్చి ఆ ఇంటి యజమాని పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఘోరాడోంగ్రి తాలూకా మొర్‌డోంగ్రీ గ్రామంలోని ఓ ఇంటి పరిసరాల్లోకి పాము జొరబడింది. సమీపంలో కనిపించిన కోళ్లను కాటేసి.. రెండు కోడి పిల్లలను, నాలుగు గుడ్లను మింగేసింది. కోళ్లు చనిపోయి కనిపించడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసిన యజమాని కోపంతో రగిలిపోయాడు. ఆ కోళ్ల సమీపంలోనే ఉన్న పామును చూశాడు. తన కోళ్లను మింగేసిన ఆ పాముపై కోపంతో రగిలిపోయిన ఆ ఇంటి యజమాని ఆ పామును కొట్టి చంపలేదు.

    కోడి గుడ్ల డబ్బాను తీసుకొచ్చి పాము దగ్గర్లో ఉంచాడు. ఆ డబ్బాలోకి పాము వెళ్లగానే మూత పెట్టి పామును బంధించాడు. ఆ ప్లాస్టిక్ డబ్బా మూతకు ఓ రంధ్రం చేసి.. ఆ రంధ్రంలో నుంచి నీళ్లు పోసి.. కరెంట్ వైర్‌ను ఆ నీళ్ల డబ్బాలో వేశాడు. ప్లగ్ పెట్టి స్విచ్ వేశాడు. ఆ డబ్బాలో ఉన్న పాము ఆ యజమాని చేసిన పనికి కరెంట్ షాక్‌కు గురైంది. రెండుమూడు సార్లు స్విచ్ ఆఫ్ చేసి, ఆన్ చేసి ఆ పాము డబ్బాలో గిలగిలా కొట్టుకొంటుంటే ఆ వ్యక్తి చూసి పైశాచిక ఆనందం పొందాడు. ఇలా చేసి చివరకు చనిపోయిందనుకుని ఆ పామును బయట విసిరేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఈలోపు ఘటన గురించి తెలుసుకున్న స్నేక్ ఫ్రెండ్లీ సభ్యుడు భీమ్ సాహూ అక్కడికి చేరుకున్నాడు.

    ఇది కూడా చదవండి: Woman Constable: 9 నెలల క్రితం కనిపించకుండాపోయిన లేడీ కానిస్టేబుల్.. చివరకు అక్కడ కనిపించడంతో అవాక్కైన పోలీసులు

    ఆ పాము అప్పటికీ ఊపిరితో ఉందని గుర్తించాడు. దాదాపు మూడు గంటల పాటు ఆ పాముకు ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ చేసిన సాహూ ఎట్టకేలకు ఆ పాము మళ్లీ మాములు స్థితికి చేరుకునేలా చేశాడు. ఆ పాము కోలుకోగానే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది వచ్చి ఆ పామును తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. రేంజర్ అమిత్ సాహూ మాట్లాడుతూ.. కరెంట్ పెట్టి ఆ పామును హింసించిన ఆ వ్యక్తిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూగ జీవాలను హింసించవద్దని.. జనావాసాల్లోకి విష సర్పాలు ప్రవేశిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని రేంజర్ గ్రామస్తులకు సూచించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Snake, Snake bite

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు