అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం...నలుగురు మృతి

మెర్సీ ఆస్పత్రిలో లేడీ డాక్టర్‌పై ముందుగా కాల్పులు జరిపిన వ్యక్తి ఆ తర్వాత మరో మహిళ కూడాపై ఫైరింగ్ జరిపాడు.అనంతరం అడ్డుకన్న పోలీస్ అధికారి జిమెనెజ్‌ను కూడా చంపేశాడు. మరో పోలీస్ గాయాలపాలయ్యాడు.

news18-telugu
Updated: November 20, 2018, 12:48 PM IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం...నలుగురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తుపాకి రాజ్యమేలుతున్న అగ్రాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పలకు తెగబడటంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కొల్పోయారు. షికాగోలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మెర్సీ ఆసత్రి పార్కింగ్ ప్లేస్‌లో ఓ వ్యక్తి మహిళతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అతడు విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో పోలీస్ అధికారి సహా ముగ్గురు మృతిచెందారు. కాల్పులకుపాల్పడిన వ్యక్తి కూడా చనిపోయాడు. మెర్సీ ఆస్పత్రిలో లేడీ డాక్టర్‌పై ముందుగా కాల్పులు జరిపిన వ్యక్తి ఆ తర్వాత మరో మహిళ కూడాపై ఫైరింగ్ జరిపాడు.అనంతరం అడ్డుకన్న పోలీస్ అధికారి జిమెనెజ్‌ను కూడా చంపేశాడు. మరో పోలీస్ గాయాలపాలయ్యాడు.

దుండగుడి దాడిలో ముందుగా ప్రాణాలు వదిలిన మహిళ అతడి మాజీ ప్రేయసీగా అనుమానిస్తున్నారు.మరో మహిళ ఆస్పత్రిలోపారామెడికల్ అసిస్టెంట్ సిబ్బందిగా పనిచేస్తుందని తెలిపారు.  అయితే ఆస్పత్రి ప్రాంగణలో కాల్పులు చోటు చేసుకోవడంతో సిబ్బంది, రోగులు భయాందోళనలు వ్యక్తంచేశారు. దుండగుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడా? లేదంటే తనంతట కాల్పుకొని చనిపోయాడన్న విషయం ఇంకా తెలియలేదు.

Published by: Sulthana Begum Shaik
First published: November 20, 2018, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading