Home /News /crime /

CHHATTISGARH YOUTH DIED AS HE WRAPPED IN COW DUNG AFTER STROKED BY LIGHTENING INSTEAD OF TAKING TO HOSPITAL SK

Lighting strike: పిడుగుపాటుకు గురైన వ్యక్తికి ఆవుపేడ పూస్తే బతుకుతారా? మరీ ఇంత మూఢనమ్మకమా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యువకుడిని ఆవు పేడలో చుట్టి గంట గడిచినా అతని శరీరంలో ఎలాంటి చలనం లేదు. ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. ఇంతలో సంజీవని 108 సంజీవని అంబులెన్స్ గ్రామానికి చేరుకుంది. బాధిత యువకుడిని అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అ

ఇంకా చదవండి ...
    చంద్రుడిపై రాకెట్లు పంపుతున్న ఈ కంప్యూటర్ యుగంలోనూ.. అంధవిశ్వాసాలు కనిపిస్తున్నాయి. ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలున్న కాలంలోనూ.. ఇంకా మూఢనమ్మకాలను నమ్మేవారు చాలా మంది ఉన్నారు. వీటిని గుడ్డిగా నమ్మి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న... ప్రాణాలు పోతున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ఘోరం జరిగింది. పిడుగుపాటు (Lightening Strike)కు గురైన ఓ యువకుడిని ఆస్పత్రికి తరలించడకుండా నాటు వైద్యం చేశారు. మూఢనమ్మకంతో ఒళ్లంతా పేడపూసి (Youth Wrapped in cow dung)పడుకోబెట్టారు. ఇలా చేస్తే అతడు బతుకుతాడని అక్కడి ప్రజల నమ్మకం. ఈ అంధవిశ్వాసమే వారి కొంపముంచింది. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ఆవు పేడ పూసి చాలాసేపు అలానే ఉంచడంతో .. అతడు మరణించాడు.

    Swiggy: స్విగ్గీలో కాఫీ ఆర్డర్ చేసిన యువకుడు.. డెలివరీ బాయ్‌కేమో బద్ధకం.. ఏం చేశాడంటే..

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుర్గుజా జిల్లా దరిమా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్వపరా గ్రామం మహేశ్‌పూర్‌‌కు చెందిన అమిత్ టోప్పో (18) తన తండ్రి జ్యోతిష్ ప్రకాష్ టోప్పోతో కలిసి ఆదివారం మధ్యాహ్నం గోధుమ పొలానికి వెళ్లాడు. ఇక్కడ గోధుమలు కోసిన తర్వాత, ఇద్దరూ కాపలాగా ఉన్నారు. కానీ అంతలోనే వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు వీచాయి. పెద్ద పెద్దు ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురిసింది. ఈ క్రమంలో భారీ శబ్ధంతో వారి పొలంలో పిడుగుపడింది. పిడుగు పాటుకు గురైన అమిత్ టోప్పో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొడుకు పరిస్థితి చూసి కంగారుపడ్డాడు. వెంటనే స్థానికుల సాయంతో గ్రామానికి తీసుకెళ్లాడు. ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఐతే గ్రామంలోని కొందరు పెద్దలు కలగజేసుకొని.. పిడుగుపాటుకు గురైన వారికి ఒళ్లంతా ఆవు పేడ పూస్తే కోలుకుంటారని చెప్పారు. వారి సూచనలతో వెంటనే యువకుడి శరీరానికి ఆవుపేడ పూశారు. ఆవు పేడను పూశాక.. అతడిక ఎలాంటి ప్రమాదం ఉండదని అక్కడి ప్రజలు భావించారు.

    Cow Urine: రైతులకు శుభవార్త.. పేడతో పాటు గోమూత్రాన్ని కూడా ప్రభుత్వమే కొంటుంది

    యువకుడిని ఆవు పేడలో చుట్టి గంట గడిచినా అతని శరీరంలో ఎలాంటి చలనం లేదు. ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. ఇంతలో సంజీవని 108 సంజీవని అంబులెన్స్ గ్రామానికి చేరుకుంది. బాధిత యువకుడిని అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అతడికి పరీక్షించిన అనంతరం వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆవు పేడ పూసి సమయం వృథా చేయకుండా.. వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే.. ఆ యువకుడు బతికే అవకాశం ఉండేదని చెప్పారు. కాగా, అక్కడి ప్రజల్లో చాలా కాలంగా మూఢనమ్మకాలు ఉన్నాయని స్వచ్ఛంద సంస్థల వారు తెలిపారు. మూఢ నమ్మకాలు,నాటు వైద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో మూఢవిశ్వాసాలు తొలగిపోయేలా ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chhattisgarh, Cow Dung

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు