ఇటీవల ఇద్దరు ఉద్యోగుల కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. వారిలో ఒకరిని విడిచి పెట్టగా.. మరొకరిని వాళ్త దగ్గరే ఉంచుకున్నారు. అతడికి విడిపించడం కోసం అతడి భార్య పోరాటం చేస్తోంది. తన కొడుకుని చంకలో పెట్టుకొని అడవి బాట పట్టింది. దీంతో తెలిసిన వారంతా.. అతడిని విడిచిపెట్టాలని.. తన భార్య చేసే పోరాటకైనా మావోయిస్టులు ఆలోచించాలని వేడుకుంటున్నారు. అసలేం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. రహదారి పనులను పరిశీలించేందుకు మావోయిస్టుల కంచుకోటగా భావించే గోర్న మంకేలికి వెళ్ళిన పీఎంజీఎస్‌వై సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్, అతని సహాయకుడు అటెండర్ లక్ష్మణ్ పరాత్‌గిరిని నక్సల్స్ కిడ్నాప్ చేశారు.
ఈ ఘటన నవంబర్ 11 న జరిగింది. వారిద్దరూ కనిపించకుండా పోయారు. రోడ్డు పనులను తనిఖీ నిమిత్తం వెళ్లిన వారు నేటికీ తిరిగి రాకపోవడంతో ఆ శాఖ ఉద్యోగుల్లో కలవరం కలిగించింది. కాగా, ఈ ఘటనపై పీఎంజీఎస్‌వై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరామ్ ఠాకూర్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. అయితే ఉద్యోగుల మిస్సింగ్‌కు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. తర్వాత వివరాలను సేకరించిన పోలీసులు వాళ్లను విడిపించేందుకు ప్రయత్నం చేశారు.
ఆ తరువాత నవంబరు 12వ తేదీన అడెండర్ లక్ష్మణ్‌ను విడిచిపెట్టారు. సబ్ ఇంజనీర్‌ను మాత్రం ఇంకా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. దాంతో ఆందోళనకు గురైన రోషన్ భార్య అర్పిత .. తన భర్తను విడిచిపెట్టాలని కోరుతూ మావోయిస్టుల ప్రాంతాన్ని వెతుక్కుంటూ అడవిబాటపట్టింది. ఈ క్రమంలో సబ్ ఇంజనీర్ అజయ్ ను విడిచి పెట్టాలని మావోయిస్టులను వేడుకుంది.
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అజయ్ రోషన్‌ను క్షేమంగా విడిచిపెట్టాలని అతని భార్య, కుటుంబ సభ్యులు మావోలను వేడుకుంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి.. మావోయిస్టులను వేడుకున్నారు. వాళ్ల నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో ఆ గ్రామంలో ఆమె చేసే పోరాటానికి తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatisghad, Crime news, Maoist