రేప్ కేసులో IAS ఆఫీసర్... అజ్ఞాతంలో కలెక్టర్... పోలీసుల వేట...

ఓ కలెక్టర్ ఎలా రేప్ చేయగలిగాడు? బాధితురాలు ఎందుకు తప్పించుకోలేకపోయింది? ఇప్పుడా కలెక్టర్ ఎక్కడ? పోలీసులు ఏమంటున్నారు?

news18-telugu
Updated: June 9, 2020, 1:15 PM IST
రేప్ కేసులో IAS ఆఫీసర్... అజ్ఞాతంలో కలెక్టర్... పోలీసుల వేట...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఛత్తీస్‌గఢ్... రాయ్‌పూర్ పోలీసులకు ఓ కేసు సవాలుగా మారింది. ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న 33 ఏళ్ల మహిళ... గత నెల్లో కలెక్టర్ ఆఫీస్‌కి వచ్చింది. ఎన్జీవోకి ఫండ్స్ ఇవ్వాలని కోరింది. అప్పుడు ఆమెతో మాట్లాడిన కలెక్టర్... ఆ టైంలో డబ్బు లేదనీ... ఉన్నప్పుడు కాల్ చేస్తానని ఆమె దగ్గర పర్సనల్ మొబైల్ నంబర్ తీసుకున్నాడు. సరేనన్న ఆమె... ధన్యవాదాలు చెప్పి... కలెక్టర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయింది. అతను 2007 IAS బ్యాచ్ ఆఫీసర్ జానక్ పాఠక్. జాంజిగిర్-చంపాలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనపై ఇప్పుడు ఆ మహిళ రేప్ కంపైంట్ ఇవ్వడంతో... అదుపులోకి తీసుకుందామని పోలీసులు కలెక్టర్ ఇంటికి వెళ్లారు. కానీ ఆయన ఇంట్లో కనిపించలేదు. తమ ముందు హాజరవ్వాల్సిందిగా నోటీస్ అంటించి వెళ్లారు పోలీసులు.

కలెక్టర్ కోసం పోలీసులు చాలా ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆయన కనిపించలేదు. సో, పరారీలో ఉన్నట్లు అర్థమైంది. ప్రభుత్వం ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఇంతలో ఆ మహిళ పోలీసుల దగ్గరకు వచ్చి మరో షాకింగ్ విషయం చెప్పింది. ఏంటంటే... రాష్ట్ర డీజీపీ DM అవస్థీ నుంచి తనకు ప్రాణాపాయం ఉందన్న బాధితురాలు... తనకు రక్షణ కల్పించాలని కోరింది. ఇదో ట్విస్టా అనుకుంటూ పోలీసులు ఆమెకు సెక్యూరిటీ కల్పించారు.

గత నెల్లో కలెక్టర్ నుంచి ఆ మహిళ వెళ్లిన తర్వాత... కలెక్టర్ మళ్లీ ఆమెకు కాల్ చేశాడు. "మీకు ఇవ్వడానికి నా దగ్గర మనీ లేదు. కాకపోతే... మీ ఎన్జీవోకి మేం కొన్ని పనులు అప్పగిస్తాం. తద్వారా మీకు చాలా డబ్బు వస్తుంది. ఆ పనులేంటో తెలుసుకోవడానికి ఓసారి సాయంత్రం 5 తర్వాత రండి" అన్నాడు. 5 తర్వాత... ఆఫీస్ ఉంటుందా? అని ఆమె అడిగింది. "జనరల్‌గా మేం 5 తర్వాత ప్రభుత్వ పనులు ముగిస్తాం. కాకపోతే... మీది స్వచ్ఛంద సంస్థ కాబట్టి... మీ పని ఇవాళ ప్రత్యేకంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పడంతో... సరే అని ఆమె 5 గంటలకు వెళ్లింది.

ఆమెతో ఏదేదో మాట్లాడుతూ కలెక్టర్... తన సీటులోంచీ లేచాడు. ఎన్జీవో అంటే అదీ, ఎన్జీవో అంటే ఇదీ అంటూ ఏదేదో మాట్లాడుతూ... మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. అతను చెప్పేది ఆమె శ్రద్ధగా వినసాగింది. ఆ తర్వాత కలెక్టర్ ఆమెపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. కలెక్టరేట్ కార్యాలయంలోనే తనను రేప్ చేశాడని ఆమె కంప్లైంట్‌లో క్లియర్‌గా చెప్పింది. అంతే కాదు... సాయంత్రం వేళ రమ్మన్నట్లుగా ఉన్న ఫోన్ కాల్స్ సంభాషణలను కూడా ఆధారాలుగా సమర్పించింది. దాంతో... కలెక్టర్ తప్పు చేసే ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దొరికిన తర్వాత అరెస్టు చేసి... ఎంక్వైరీ చేస్తామంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: June 9, 2020, 1:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading