Home /News /crime /

CHHATTISGARH MAN SLASHES GIRLS WRIST FOR NOT TALKING TO HIM RUNS AWAY WITH HER MOBILE PHONE PAH

ప్రియురాలు అవాయిడ్ చేస్తోందని తట్టుకోలేక పోయాడు... ఇంటి కెళ్లి అది కోసేశాడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chhattisgarh: ఇద్దరిది ఒకే గ్రామం. ఈ క్రమంలో తరచుగా మాట్లాడుకునే వారు. ఇది స్నేహంగా మారింది. ఇద్దరు చనువుగా ఉండే వారు. అమ్మాయికి ఉద్యోగం రావడంతో ఆమె వేరే పట్టణానికి వెళ్లింది.

కొంత మంది యువకులు అమ్మాయిల పట్ల షాడిస్టులుగా ప్రవర్తిస్తుంటారు. ప్రేమ పేరుతో వారి వెంట పడతారు. ప్రేమించాలని వేధిస్తుంటారు. ఇష్టంలేదని చెబితే భౌతిక దాడులు చేయడానికి సైతం వెనుకాడరు. మరికొంత మంది ప్రేమను తమ అవసరాల కోసం వాడుకుంటారు. తమ మోజు, అవసరాలు తీరిపోయాక అబ్బాయిలను అవాయిడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో అబ్బాయిలు కంట్రోల్ తప్పుతుంటారు. అమ్మాయిలపై దాడులు చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దారుణ ఘటన జరిగింది. బిలాస్ పూర్ లోని చిర్మిరి అనే గ్రామంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. ఆకాష్ సాహు అనే యువకుడు.. అదే గ్రామంలో ఉండే యువతిని ప్రేమించాడు. ఇద్దరు కలిసి ఉండే వారు. తరచుగా కలుసుకునే వారు. అయితే, అమ్మాయికి బిలాస్ పూర్ లో ఉద్యోగం వచ్చింది. దీంతో అబ్బాయితో మాట్లాడటం తగ్గించేసింది. ఈ క్రమంలో.. ఆకాష్ సాహు, అమ్మాయిపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం నాడు.. చిర్మిరిలో ఒక మొబైల్ ఫోన్ దొంగిలించాడు. ఆ తర్వాత.. నేరుగా అమ్మాయి ఉంటున్న ఇంటికి వెళ్లాడు.



అప్పుడు రాత్రి 11 అవుతుంది. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరు వాదించుకున్నారు. దీంతో కోపంలో కంట్రోల్ తప్పాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో అమ్మాయి మణికట్టు మీద దాడి చేశాడు. చేతికి, గాయాలయ్యాయి. అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో అతను పారిపోయాడు. అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా కర్ణాటకలో ఒక బ్యాంకు మేనెజర్ యువతి హనీ ట్రాప్ వలలో పడ్డాడు.

ఇండియన్ బ్యాంక్ లో ఆడిట్ కు వచ్చిన అధికారులు డబ్బులు నిల్వలు తక్కువగా ఉండటంతో ఆరా తీయగా ఘటన వెలుగులోనికి వచ్చింది. బెంగళూరులోని హనుమంతనగర్‌లో ఉన్న ఇండియన్ బ్యాంక్ మేనెజర్ హరిశంకర్, డేటింగ్ యాప్ లో యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కాల్స్.. వరకు వెళ్లింది. హరిశంకర్ ఆమె బుట్టలో పడిపోయాడు. ఈ క్రమంలో.. తన ప్రియురాలి కోసం కస్టమర్ లు బ్యాంక్ లో పెట్టిన సోమ్మును ఆమె చెప్పిన అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్ చేశాడు.

అతగాడు.. ఏకంగా .5.7 కోట్లను యువతి చెప్పిన అకౌంట్ లకు మళ్లించాడు. కాగా, మే 13 నుంచి 19 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్ లో 28 ఖాతాలకు, కర్ణాటకలోని 2 ఖాతాలకు.. మొత్తం 136 లావాదేవీల్లో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అతని పర్సనల్ డబ్బులు.. 12.5 లక్షలను కూడా ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరిశంకర్ ను అరెస్టు చేశారు. అనేక కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Chhattisgarh, Crime news, Harassment

తదుపరి వార్తలు