Man Beaten Mercilessly : వద్దు వద్దు అని బతిమాలుతున్నా వినకుండా కర్రలతో మహవీర్ పై కర్రలతో తమ ప్రతాపం చూపించారు. అనంతరం మహవీర్ రెండు కాళ్లు తాడుతో కట్టి ఒక చెట్టుకు వేలాడదీసి మరీ అతడిని చితకబాదారు. అతడు ఎంత మొరపెట్టుకున్నా వారు కనికరించకుండా కర్రలతో చావబాదారు.
Man Hung From Tree Beaten Mercilessly : దొంగతనం చేశాడన్న అనుమానంతోనే ఓ సెక్యూరిటీ గార్డుని చెట్టుకు వేలాడదీసిన కొందరు దారుణంగా కొట్టారు. వదిలేయండి..ప్లీజ్ అని వేడుకుంటున్నా కనికరించకుండా చావగొట్టారు. సెక్యూరిటీ గార్డు రెండు కాళ్లు తాడుతో కట్టి ఒక చెట్టుకు వేలాడదీసి మరీ కర్రలతో చితకబాదారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లా సిపత్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్(Video Viral) అవుతోంది.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బిలాస్పూర్ జిల్లా సిపత్ పట్టణానికి చెందిన మహవీర్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండేవాడు. అయితే ఈ వారం ప్రారంభంలో మహావీర్ తన ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించినట్లు మనీష్ అనే వ్యక్తి ఆరోపించాడు. దీంతో తన కుటుంబ సభ్యులు అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అతడు చెప్పాడు. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా ఈ వ్యవహారాన్ని తాము సెటిల్ చేసుకుంటామని చెప్పడంతో మహావీర్ కు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు పోలీసులు. అయితే ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం మనీష్ సహా మరికొందరు కలిసి.. మహావీర్ ను ఏరి చివిర ఓ ప్రాంతంలో బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. వద్దు వద్దు అని బతిమాలుతున్నా వినకుండా కర్రలతో మహవీర్ పై కర్రలతో తమ ప్రతాపం చూపించారు. అనంతరం మహవీర్ రెండు కాళ్లు తాడుతో కట్టి ఒక చెట్టుకు వేలాడదీసి మరీ అతడిని చితకబాదారు. అతడు ఎంత మొరపెట్టుకున్నా వారు కనికరించకుండా కర్రలతో చావబాదారు.
కొందరు దీనిని తమ మొబైల్లో రికార్డు చేశారు. ఈ చిత్రహింసలు చూసిన ఒక మహిళ, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దీని గురించి చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి మహావీర్ను రక్షించారు. మరోసారి తమ ఇంట్లో దొంగతనం చేశాడనే కారణంతో మహవీర్ ను మనీష్ సహా అతని ఫ్రెండ్స్ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మనీష్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరి కొందరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.