హోమ్ /వార్తలు /క్రైమ్ /

నీ క్యారెక్టర్ బాలేదు.. అందుకే చంపేస్తున్నా.. భార్యకు మద్యం తాగించి హత్య చేసిన భర్త

నీ క్యారెక్టర్ బాలేదు.. అందుకే చంపేస్తున్నా.. భార్యకు మద్యం తాగించి హత్య చేసిన భర్త

Husband killed wife: తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఆమె క్యారెక్టర్ నచ్చకే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు.

Husband killed wife: తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఆమె క్యారెక్టర్ నచ్చకే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు.

Husband killed wife: తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఆమె క్యారెక్టర్ నచ్చకే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు.

  భార్యాభర్తలిద్దరు పార్టీ చేసుకున్నారు. ఇంట్లో చికెన్ కర్రీ వండుకున్నారు. ఆల్కాహాల్ కూడా తెచ్చుకున్నారు. ముక్క తింటూ.. చుక్క తాగుతూ.. సరదాగా మాట్లాడుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే అతడిలోని మృగం నిద్రలేచింది. భార్యతో గొడవకు దిగాడు. నీ క్యారెక్టర్ బాగాలేదు..నన్ను మోసం చేస్తున్నావని.. వాగ్వాదానికి దిగాడు. తానే తప్పు చేయలేదని ఆమె నచ్చెజెప్పే ప్రయత్నం చేసింది. మాటా మాటా పెరిగడంతో ఆ భర్త రెచ్చిపోయాడు. ఓ కర్రతో భార్య తలపై బలంగా కొట్టాడు. అంతే ఆమె కుప్పకూలింది. అక్కడికక్కడే మరణించింది. భర్త కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయింది. భార్య మరణించిందని నిర్ధారించుకున్నాక అతడు అక్కడి నుంచి పారిపోయాడు. (Husband kills wife). ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh murder) బల్‌రామ్‌పూర్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 1న కోటగహ్నా గ్రామంలో ఓ మహిళ మృతదేహం లభ్యమయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆమె శరీరంపై గాయాల గుర్తులున్నాయి. మహిళ మృతదేహానికి పోస్టుమార్టం కోసం పంపించారు. ఆమె కుటుంబ సభ్యులను అడిగి వివరాలను తెలసుకుందామని అనుకున్నారు. కానీ మృతురాలి భర్త పరారీలో ఉన్నాడు. దాంతో అతడే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. అతడి కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించి గాలించారు. ఎట్టకేలకు ఆమె భర్తను వెతికి పట్టుకున్నారు. విచారణలో తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు.

  బతికుండగానే అంత్యక్రియలు చేసుకున్నాడు.. తన ఫొటోపై కీర్తి శేషులు అని రాసుకుని..

  తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఆమె క్యారెక్టర్ నచ్చకే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. హత్య జరిగిన రోజు ఇద్దరం కలిసి మద్యం తాగామని.. ఆ క్రమంలో తమ మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. తాను ఎంత చెప్పినా వినడం లేదని.. ప్రవర్తన మార్చుకోలేదని పేర్కొన్నాడు. అందుకే మద్యం మత్తులో తన భార్యను హత్య చేసినట్లు వివరించాడు. పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేసి..ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. హత్యకు ఉపయోగించిన కర్రను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌పై జైల్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

  Chor Village: మీ వస్తువు ఏదైనా పోయిందా.. ఖచ్చితంగా ఆ గ్రామంలోనే ఉండొచ్చు..

  ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. భార్య సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని.. వేరొక వ్యక్తితో చనువుగా ఉంటుందని.. కొందరు వ్యక్తులు దారుణాలకు పాల్పడుతున్నారు. భార్య తప్పు చేస్తోందని అనుమానించి.. హత్యలు చేస్తున్నారు. అందులో నిజమెంతో.. అబ్ధమెంతో తెలియదు.. కానీ కేవలం అనుమాన భూతంతోనే కట్టుకున్న భార్యను కడతేర్చుతున్నారు. క్షణికావేశంలో నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

  First published:

  Tags: Chhattisgarh, Crime news, Murder, National News

  ఉత్తమ కథలు