Home /News /crime /

CHHATTISGARH KAWARDHA HUSBAND TORTURED WIFE FOR SON MALE DOMINATION NEWS GOES VIRAL PAH

వరుసగా ఐదుగురు ఆడపిల్లలు.. భార్య నా వల్ల కాదన్న వినలేదు.. ట్విస్ట్ ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chhattisgarh: మహిళకు ఇప్పటికే వరుసగా ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. వారిని చూసుకొవడం ఇబ్బందికరంగా మారింది. కానీ ఆమె భర్త మాత్రం కొడుకు కావాలని ప్రతి రోజు వేధిస్తుండే వాడు.

మహిళలపై ఇప్పటికి అనేక చోట్ల లింగ వివక్ష కొనసాగుతుంది. ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఇప్పటికి కొంత మందిలో మాత్రం రావడం లేదు. తమకు కొడుకు కావాలంటూ మహిళలను వేధిస్తున్నారు. ఆడపిల్లల పట్ల వివక కనబరుస్తూనే ఉన్నారు. తమ వంశం నిలబడాలని, దీని కోసం మగ పిల్లాడు పుట్టే వరకు భార్యలను ఆపరేషన్ చేయించడానికి ఒప్పుకొవడం లేదు. ఇలాంటి షాడిస్ట్ భర్త ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఛత్తీస్ గఢ్ లో (Chhattisgarh) దారుణ ఘటన జరిగింది. కవార్దాలోని చీర బంధ ప్రాంతంలో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. మన్మోహన్ సాహు (40), రసితా బాయి (36) భార్య భర్తలు. వీరికి ఇప్పటి వరకు ఐదుగురు సంతానం. అందరు ఆడపిల్లలే. మన్మోహన్ సాహుకు మగ సంతానం అంటే ఎంతో ఇష్టం. దీంతో భార్య ఎన్ని సార్లు.. ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పిన వినలేదు. ప్రతిసారి మగ సంతానం కోసం వేచిచూశాడు. కానీ ఆడపిల్లలే పుట్టారు.



ఈ క్రమంలో భార్యకు వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో విసిగిపోయిన భార్య స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లింది. భర్తకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకుంది. ఆ తర్వాత.. భర్తకు భార్య, ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసింది. దీంతో భర్త.. రసితా బాయితో గొడవకు (Harassment)  దిగాడు. ఆమెను నోటికొచ్చినట్టు తిట్టి, దాడిచేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా కలత చెందిన రసితాబాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌(Madhya pradesh)లోని ఇండోర్‌లో ఓ భర్త చేసిన పని తెలిసి భార్య ఆశ్చర్యపోయింది.

ఛోటా బంగార్డా ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం బబిత అనే మహిళతో వివాహమైంది. 15 రోజుల క్రితం తండ్రి కూడా అయ్యాడు. అయితే భార్యను ప్రసవం కోసం ఆమె పుట్టింటికి పంపించిన భర్త తర్వాత ఖజ్రానా ప్రాంతానికి చెందిన మరో అమ్మాయితో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్యకు ఫేస్‌బుక్ ద్వారా తెలిసింది. దీంతో భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బబిత. భర్త చాలా కాలంగా ముస్లిం అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య బబిత ఆరోపిస్తోంది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. భర్త మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని భార్య చెప్పింది. అంతే కాదు భర్త ఫోన్‌లో కూడా తనను బెదిరించాడని తెలిపింది.

బబిత 15 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టిన తర్వాత నిందితుడైన భర్త ఆమెను కలవలేదు. అంతే కాదు అత్తమామలు కూడా తనను కలవడానికి రాలేదని బబిత తెలిపింది. భర్త వ్యవహారంపై అత్తమామలని ప్రశ్నించగా.. అత్తగారు తనను బెదిరించారని, మౌనంగా ఉండకపోతే నీ అంతుచూస్తాం అని తనను బెదిరించారని బబిత తెలిపింది. తన భర్త కూడా వేరే ఫోన్ నెంబర్ నుంచి తనకు ఫోన్ చేసి బెదిరించాడని భార్య ఆరోపిస్తోంది. నిందితుడైన భర్త ఎక్కడున్నాడో, ఎవరితో ఉన్నాడో అత్తగారికి తెలుసని మహిళ పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Chhattisgarh, Crime news, Female harassment, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు