ఛత్తీస్ గఢ్ లో (Chhattisgarh) విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ హెలికాప్టర్ రాయ్ పూర్ విమానాశ్రయంలో గురువారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలేట్లు సంఘటన స్థలంనే చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. హెలికాప్టర్ తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటన రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో (Helicopter Crashes) రాత్రి 9.10 నిముషాలకు చోటు చేసుకుంది. ప్రమాదం జరగ్గానే అధికారులు వెంటనే పైలేట్లను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
వీరిని చూసిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. చనిపోయిన వారిలో కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ ఎపి శ్రీవాస్తవ లు ఉన్నట్లు గుర్తించారు. హెలికాప్టర్ (chopper crash) ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘెల్ (Bhupesh baghel) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనతో చనిపొయిన వారి కుటుంబాలలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.
ఢిల్లీకి (Delhi) చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారి (Air force officer) హనీ ట్రాప్ లో (Honey trap) ఇరుకున్నారు.
ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాశంగా మారంది. భారత దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారి దేవేంద్ర శర్మ హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. నిందితుడు ఢిల్లీలోని సుబ్రోటో పార్క్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) రికార్డ్ ఆఫీస్‌లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (జిడి)గా పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. భారత దేశానికి చెందిన ముఖ్యమైన రహస్యాలను సోషల్ మీడియా ద్వారా లీక్ చేసినట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ (Delhi crime branch) పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈయన ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి అరెస్టు చేశారు.
దేవేంద్ర శర్మ.. (Devendra sharma) ఎయిర్ ఫోర్స్ కు చెందిన ముఖ్యమైన రహస్యాలను అవతలివారికి పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మే 6 న ఇతడిని అరెస్టు చేసినప్పటికి.. ఈ రోజు పోలీసులు అధికారికంగా అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. నిందితుడు ఎన్ని రోజుల నుంచి విషయాలను లీక్ చేస్తున్నాడు.. ఇప్పటి వరకు ఏయే విషయాలను చెప్పినట్లు పలు విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిందితుడి ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్ లను అధికారులు తమ స్వాధీనంలోనికి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chhattisgarh, Helicopter Crash