హోమ్ /వార్తలు /క్రైమ్ /

రోడ్డుమీద యువతి పైశాచికం.. సైడ్ ఇవ్వలేదని యువకుడిపై అఘాయిత్యం.. భయంతో తల్లి..

రోడ్డుమీద యువతి పైశాచికం.. సైడ్ ఇవ్వలేదని యువకుడిపై అఘాయిత్యం.. భయంతో తల్లి..

విచారణకు తీసుకెళ్తున్న పోలీసులు

విచారణకు తీసుకెళ్తున్న పోలీసులు

Chhattisgarh: తల్లితో కలిపి అమ్మాయి స్కూటీపైన వెళ్తుంది. ఇంతలో ఆమె ముందు సైకిల్ పైన ఒక యువకుడు వెళ్తున్నాడు. ఆమె ఎన్నిసార్లు.. మోగించిన అతను మాత్రం వీరికి అసలు దారి ఇవ్వడం లేదు.

కొంత మంది చిన్నవిషయాలకు కూడా కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుంటారు. చీటికి మాటికి చిరాకు పడుతుంటారు. రోడ్డుమీద వెళ్తున్నప్పుడు ఎవరితోనైన సరే పోట్లాట పెట్టుకుంటారు. కొన్ని సార్లు.. వాహానాలు రోడ్డుపైన వెళ్తునప్పుడు కొందరు అదే పనిగా హర్న్ మోగిస్తుంటారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కల్గ చేస్తారు. మరికొందరు వేరే వెహికిల్స్ కు అసలు దారి ఇవ్వరు. కావాలనే వెనుక వచ్చే వారిని రూట్ ఇవ్వకుండా టార్చర్ చేస్తుంటారు. అయితే.. కొన్ని సందర్భాలలో ఎదుటివారిని అంచన వేయడంలో పొరపాటు పడుతుంటాం.

కొందరు దివ్యాంగులు అప్పుడప్పుడు రోడ్డు దాటుతుంటారు. మరికొందరు కర్రలు పట్టుకుని రోడ్డుపైన ఒక వైపు నుంచి మరోక పక్కకు వెళ్తుంటారు. కొన్నిసార్లు.. వీరు అనుకోకుండా వెహికిల్ కు అడ్డంగా వస్తుంటారు. అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. ఈ క్రమంలో కొందరు వీరు దివ్యాంగులని తెలుసుకోకుండా చడామడా తిట్టేస్తారు. కానీ తర్వాత.. అసలు విషయం తెలుసుకుని షాకింగ్ నకు గురౌతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌లో  (chhattisgarh) షాకింగ్ ఘటన జరిగింది. రాయ్‌పూర్‌లో కంకలిపర ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మైనర్ బాలిక తన తల్లిని ఎక్కించుకుని వెళ్తుంది. అప్పుడు స్కూటీకి ఎదురుగా ఒక వ్యక్తి సైకిల్ పైన వెళ్తున్నాడు. ఆమె హరన్ మోగించినప్పటికి అసలు పట్టించుకోవడం లేదు. దీంతో కోపంలో యువతి కంట్రోల్ తప్పింది. వెంటనే యువకుడి దగ్గరకు వెళ్లి అతనితో గోడవ పడింది. అసలు మాట్లాడట్లేదని కోపంలో.. స్కూటీలో ఉన్న కత్తితో అతని మెడపైన పొడిచింది. (Girl brutaly murder) దీంతో అతను కుప్పకూలిపడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా, చనిపోయిన వ్యక్తి సుదామ లాడర్‌ గా పోలీసులు తెలిపారు.

అతనికి వినికిడి సమస్య ఉందని, అందుకే వినిపించదని అన్నారు. అందుకే యువతికి సైడ్ ఇవ్వలేదని అన్నారు. అతను తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన అమ్మాయి కంట్రోల్ తప్పి.. అతనికిపై కత్తితో దాడిచేసి హతమార్చింది. ఘటన జరిగిన వెంటనే యువతి.. తల్లి భయపడిపోయింది. అక్కడి నుంచి కూతురు, తల్లి ఇద్దరు పారిపోయారు. ఆ తర్వాత.. పోలీసులు మైనర్ బాలికను సమీపంలోని ప్రాంతంలో అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది.

First published:

Tags: Brutally murder, Chhattisgarh, Crime news

ఉత్తమ కథలు