news18-telugu
Updated: January 9, 2020, 2:32 PM IST
ప్రతీకాత్మక చిత్రం
11 సంవత్సరాల బాలిక మీద లైంగికంగా దాడి చేసిన మాజీ ముఖ్యమంత్రి ప్రైవేట్ సెక్రటరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కొన్నాళ్ల క్రితం 11 సంవత్సరాల బాలికను తమ ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెను బాగా చదివిస్తానంటూ ఆమె తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఓ రోజు అతడి భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో అదను చూసుకుని ఆ బాలిక మీద అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమె మీద ఆ దారుణాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. దీంతో రెండు సార్లు ఆమెకు అబార్షన్ కూడా చేయించినట్టు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. తనను తన తల్లిదండ్రులు అమ్మేశారేమోననే అనుమానంగా ఉందని ఆ బాలిక పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మాజీ సీఎం ప్రైవేట్ సెక్రటరీ చేసిన దారుణాలన్నీ కలిపి సుమారు 11 పేజీల లేఖ రాసింది. దీంతో పోలీసులు రాత్రి 2 గంటల సమయంలో అతడిని అరెస్ట్ చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
January 9, 2020, 2:28 PM IST