Home /News /crime /

CHHATTISGARH FATHER KIDNAPS 8 YEAR OLD SON FROM OUTSIDE ESTRANGED WIFES HOUSE PAH

భార్య ఇంటి దగ్గర రెక్కి.. కొడుకును కిడ్నాప్ చేసిన తండ్రి.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chhattisgarh: కొడుకును కిడ్నాప్ చేయడానికి తండ్రి కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. బాలుడి కోసం ఇంటి చుట్టు రెక్కి నిర్వహించాడు. ఇంటి ముందు సింగిల్ గా ఆడుకుంటున్న బాలుడిని చూశాడు.

కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. భార్య భర్తల మధ్య గొడవలు వస్తే ఆ కోపాలను పిల్లల మీద చూపిస్తుంటారు. ఇప్పటికే కొంత మంది కోపంతో తమ పిల్లలను కొట్టడం, గాయపర్చడం, ఆరుబయట నిల్చోండుపెట్టడం చేస్తుంటారు. మరికొన్నిచోట్ల మరీ దారుణంగా.. పిల్లలను నానా రకాలుగా హింసలకు గురిచేస్తుంటారు. ఇలాంటి అనేక సంఘటనలు గతంలో జరిగాయి. కొంత మంది భర్తలు.. ఏదైన గొడవ జరిగితే పిల్లలను కిడ్నాప్ (Kidnap)  చేయడానికి సైతం వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అమానుష ఘటన జరిగింది. రాయ్ పూర్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. రాయ్ పూర్ లోని హిమాలయన్ హైట్స్ కాలనీలో లోకేష్ సింగ్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. వీరికి యుగ్విహాన్ అనే ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే, కొన్నేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు (Kidnap) మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు తరచుగా గొడవలు పడేవారు. ఈ క్రమంలో గొడవలు, కొట్టుకొవడం వరకు(family disputes)  వెళ్లింది. దీంతో భార్య, తనకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఆమె తన పుట్టింట్లో ఉంటుంది.



కోర్టు పిల్లాడి బాధ్యతలను కన్నతల్లికి అప్పగించింది. ఈ క్రమంలో.. కొన్ని రోజులుగా తండ్రి.. తన భార్యను మానసికంగా వేధిస్తున్నాడు. కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఇంట్లో వారు కొడుకును జాగ్రత్తగా చూసుకునే వారు. ఈ క్రమంలో.. పిల్లవాడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. అప్పుడు తండ్రి అక్కడికి వెళ్లి , బాబును ఎత్తుకొని సుమోలో వెళ్లిపోయాడు.

ఎంత సేపటికి పిల్లాడు ఇంటి లోపలికి రాకపోవడంతో తల్లి కంగారు పడింది. వెంటనే అక్కడి వారిని వాకబూ చేయగా.. అతని తండ్రి తీసుకెళ్లాడని తెలిపారు. దీంతో బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడిని ఏంచేస్తారో అని.. తల్లి కంగారు పడుతుంది. ఘటన పట్ల పిల్లాడి మేనమామ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. బాబుని మధ్య ప్రదేశ్ కి తీసుకెళ్లి ఉండవచ్చిని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ  క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దీనిలో లోకేష్ సింగ్ బాలుడిని తీసుకెళ్తున్నట్లు రికార్డు అయ్యింది. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Chhattisgarh, Crime news, Female harassment, Kidnap

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు