ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుమారు 10 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లోని బైరామ్గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతాబలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు- భద్రతాబలగాలకు మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 11 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. చనిపోయిన వారి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్కౌంటర్ జరగడం ఇదే మొదటిసారి. పదిహేనేళ్ల బీజేపీ పాలన తర్వాత ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. డిసెంబర్ 17న భూపేష్ భాగల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.