హోమ్ /వార్తలు /క్రైమ్ /

కంట్రోల్ తప్పిన భార్య.. గొడ్డలితో భర్త పురుషాంగాన్ని కట్ చేసింది.. ఎందుకంటే..

కంట్రోల్ తప్పిన భార్య.. గొడ్డలితో భర్త పురుషాంగాన్ని కట్ చేసింది.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chhattisgarh: కొన్నిరోజులుగా భర్త ఇంటికి రాగానే భార్యను ఏదో ఒక వంక పెడుతున్నాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యేది. ప్రతిసారి ఎంత చెప్పి చూసిన అతగాడి బుద్ధి మాత్రం మారలేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Chhattisgarh, India

కొందరు పెళ్లి చేసుకుని కట్టుకున్న వారికి నరకం చూపిస్తుంటారు. కట్నం తేలేదని, బంగారం ఇవ్వలేదని, అందంగాలేదంటూ మహిళలను వేధిస్తుంటారు. ఇక అమ్మాయిలు కూడా భర్త, అత్తమామలను వేపుకుని తింటుంటారు. మరికొందరు పెళ్లయ్యాక కూడా అత్తింట్లో చెలాయించుకొవాలని భావిస్తుంటారు. తమ కుటుంబాన్ని చిన్న చూపు చూస్తారు. ఇంకొందరు పెళ్లి చేసుకుని, అంతబాగుందని అనుకుంటే.. పక్కింటి వారితో, ఎదురింటి వారితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. కొందరైతే.. భార్య ఏది వండిన బాగా లేదని, భార్యను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చిత్రహింసలకు గురిచేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఛత్తీస్ గఢ్ లోని (Chhattisgarh) దుర్గ్ జిల్లాలో షాకింగ్ జరిగింది. స్థానికంగా అమలేశ్వర్ గ్రామంలోఅనంత్ సోన్వానీ తన భార్య సంగీత తో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు మొదట్లో బాగానే కలిసి ఉండేవారు. అయితే.. కొన్నిరోజులుగా అనంత్ తన భార్యను నల్లగాఉన్నావంటూ వేధిస్తుండేవాడు. ఆమె శరీరంపై మచ్చలున్నాయని టార్చర్ చేసేవాడు. తరచుగా అసభ్యంగా పిలిచేవాడు.

దీంతో ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవ కూడా జరిగింది. ఈ క్రమంలో ఆమె భర్త వేధింపులకు కంట్రోల్ తప్పింది. ఆదివారం రాత్రి కూడా భర్తతో గొడవ జరిగింది. భర్త పడుకున్న తర్వాత.. ఒక గొడ్డలి తీసుకుంది. అతనిపై ఇష్టమోచ్చినట్లు దాడిచేసింది. అంతే కాకుండా... భర్త పురుషాంగాన్ని కూడా కోసేసింది.

ఆతర్వాత.. ఏం తెలియనట్లు పడుకుంది. ఉదయాన్నే తన భర్తను ఎవరో చంపేశారని కొత్త నాటకానికి తెరలేపింది. అయితే.. అక్కడికి చేరుకున్న పోలీసులు భార్య కదలికలు అనుమానస్పదంగా ఉండటంతో ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. తమదైన శైలీలో విచారించగా ఆమె నేరాన్ని అంగీకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా చెన్నైలో (Chennai)  ఇషితా సింగ్ అనే డిగ్రీ యువతి స్థానికంగా ఉన్నసిటీ హోటల్ కు వెళ్లింది.

తిరిగి ఇంటికి రావడానికి ఉబర్ లో ఆటోను బుక్ చేసుకుంది. అప్పటికే రాత్రి 10 అయ్యింది. ఆమె స్నేహితురాలు ఆటో దిగుతుండగా ఆటో డ్రైవర్ , బాలిక రొమ్మును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే గట్టిగా అరవడంతో అతను పారిపోయాడు. వెంటనే యువతి.. స్థానికంగా ఉన్న లేడీ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ మహిళా పోలీసులు ఎవరు లేరు.

దీంతో ఎఫైఐఆర్ నమోదు చేయలేదు. అక్కడ రాత్రిపూట అని.. స్టేషన్ లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదని యువతి వాపోయింది. ఈ క్రమంలో ఆటోరిక్షా ఫోటోలను ట్విటర్ లో పోస్టు చేసింది. సెల్వం అనే ఉబర్ డ్రైవర్ తన కుడి రొమ్మును నొక్కి అసహ్యంగా ప్రవర్తించాడని తన బాధను ట్విటర్ లో పోస్ట్ చేసింది.  ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. యువతి పోలీసు కమిషనర్ కు ట్యాగ్ చేసింది. వెంటనే అధికారులు దీనిపై రిప్లై ఇచ్చారు. కేసు నమోదు చేశామని, వెంటనే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Chhattisgarh, Crime news

ఉత్తమ కథలు